Begin typing your search above and press return to search.

అందుకు రాంచరణే కారణం.. మెగాస్టార్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 April 2020 3:07 PM GMT
అందుకు రాంచరణే కారణం.. మెగాస్టార్ వ్యాఖ్యలు
X
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి చిరంజీవి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. రోజు రోజుకు చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. సోషల్ మీడియా మన డైలీ లైఫ్ లో భాగమైపోవడంతో సెలెబ్రెటీలు కూడా తమ ఫ్యాన్స్ కి టచ్ లో ఉండటానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా వారు పెట్టే పోస్ట్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టాప్ స్టార్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్ గా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఏ రకంగా తన జర్నీని కొనసాగిస్తాడో అని అంతా అనుకున్నారు.

చిరంజీవి కూడా పెద్దగా పోస్ట్స్ చేయకపోవచ్చు అనుకున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎంటర్ అవడం పెద్ద సమస్య కాదు కానీ అక్కడ ఎలా మెలగాలో అందరికీ తెలీదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ట్విట్టర్, పేస్ బుక్ వాడకంలో ఇబ్బందులు పడుతుంటారు. వీరందరూ సోషల్ మీడియా ట్రోల్స్ కి బలవుతుంటారు. సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను అందరూ గౌరవించాలని లేదు. ఒక్కొక్కసారి మనం పెట్టే పోస్ట్ నచ్చని వాళ్ళు ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు.

ఇక చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం గురించి స్పందించారు. 'నేను సోషల్ మీడియాలోకి రావడానికి కారణం రాంచరణ్. దేశంలో నిర్భయ, దిశా లాంటి మానవాళి తలదించుకునే సంఘటనలు ఎదురైనప్పుడు నేను స్పందించడానికి సరైన మార్గం కనిపించలేదు. అప్పుడు చరణ్ నాతో సోషల్ మీడియాలోకి రమ్మని పిలిచి.. ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ల గురించి తెలియజేసాడు. నాకు అసలు సోషల్ మీడియా మీద కొంచెం కూడా అవగాహన లేదు. ఈరోజు నేను ఈ విధంగా మీతో కనెక్ట్ అవుతున్నానంటే.. దానికి కారణం చరణ్ మాత్రమే" అంటూ తన సోషల్ మీడియా ఖాతాల వెనుక నిజాలను బయట పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తక్కువ టైంలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.