Begin typing your search above and press return to search.

స్మార్ట్ లుక్ లో చ‌ర‌ణ్ .. గాళ్స్ లో ర‌చ్చ రచ్చే!

By:  Tupaki Desk   |   9 Oct 2022 12:22 PM GMT
స్మార్ట్ లుక్ లో చ‌ర‌ణ్ .. గాళ్స్ లో ర‌చ్చ రచ్చే!
X
#ఆర్ సీ 15 లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంది? పొలిటిక‌ల్ డ్రామాలో శంక‌ర్ ఎలాంటి లుక్ లో దించ‌బోతున్నాడు? వంటి ఆస‌క్తిక‌ర సందేహాలు ఇప్ప‌టికే అభిమానుల బుర్ర‌ల్ని తొలిచేస్తున్నాయి. చ‌ర‌ణ్ లీక్డ్ పీక్స్ ఇప్ప‌టికే నెట్టింట హాట్ లాపిక్ గా మారాయి. సినిమా ఈవెంట్ల‌కు హాజ‌రైన‌ప్పుడు చ‌ర‌ణ్ లుక్...పాత ఫోటోల్ని పోల్చుతూ చ‌ర‌ణ్ ఇలా ఉండే? అవ‌కాశం ఉందంటూ అభిమానులు ఎవ‌రి స్టైల్లో వారు గెస్ చేస్తున్నారు.

తాజాగా అభిమానుల్ని మ‌రింత పిండేసేలా మ‌రో ఇంట్రెస్టింగ్ లుక్ ఒక‌టిప్పుడు నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. ఓసారి ఆ లుక్ ని ప‌రిశీలిస్తే... ఇందులో చ‌ర‌ణ్ క్లీన్ షేవ్ల ఓ క‌నిపిస్తున్నాడు. గుడ్డం పూర్తిగా తొల‌గించాడు. మీసం యధావిధిగా క‌నిపిస్తుంది. షేవింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ లైట్ గా ట్రిమ్ చేసారు. సాధార‌ణ హెయిర్ స్టైల్లోనే క‌నిపిస్తున్నారు.

క‌ళ్ల‌కి అద్దాలు...చేతుల్లో త‌న‌కెంతో ఇష్ట‌మైన రైమ్ ఉంది. బ్లాక్ వింట‌ర్ కోట్ లో క్యాజువ‌ల్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. మొత్తంగా ఈలుక్ లో చ‌ర‌ణ్ స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతార్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమ‌మానులు చ‌ర‌ణ్ న్యూ లుక్ చూసి సూప‌ర్బ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదే లుక్ లో షూటింగ్ లో జాయిన్ అవుతున్నారా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక గాళ్స్ లో అయితే చ‌ర‌ణ్ లుక్ సంచ‌ల‌న‌మే అవుతోంది. స్మార్ట్ లుక్ గాళ్స్ కి తెగ న‌చ్చేసింది. గాళ్సీ డీపీగా లోడ్ అవుతోంది.

చ‌ర‌ణ్ ఈ పిక్ ని త‌న ఇన్ స్టా ప్రోపైల్ లో అప్లోడ్ చేసారు. ఆర్ సీ 15 షూటింగ్ అతి త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్తి చేసారు. శంక‌ర్ అటు `ఇండియాన్-2` షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించంతో చ‌ర‌ణ్ సినిమా షూట్ ఆల‌స్య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.