Begin typing your search above and press return to search.
అభిమానులను ఎగ్జయిట్ చేస్తానన్న చెర్రీ
By: Tupaki Desk | 18 Sep 2021 5:30 AM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా ట్వీట్ ప్రస్తుతం మెగాభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. తన అభిమానుల కోసం ప్రత్యేక సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశానని ఆయన అన్నారు. తాజా షూట్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ ను ట్వీట్ చేసిన చెర్రీ.. ``మీ స్క్రీన్‌లకు వినోద ప్రపంచాన్ని తీసుకురావడానికి అన్ని సిద్ధం. ఉత్తేజకరమైనది ఏదో త్వరలో వస్తుంది!`` అంటూ టీజ్ చేశారు.
రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో బిగ్ డీల్ కుదుర్చుకున్నారని ఇటీవల ప్రచారమైంది. ప్రస్తుత కాంపిటీషన్ లో హాట్ స్టార్ ఓటీటీ ప్రచార బాధ్యతలను చరణ్ తీసుకున్నారని వెల్లడైంది. దీని ప్రోమో కోసం షూట్ చేస్తున్నప్పుడు ఆన్ లొకేషన్ ఫోటో ని ఆయన షేర్ చేశారు. ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్- తెలుగు విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సంతకం చేశారు. ప్రోమో త్వరలో విడుదలవుతుంది. మునుముందు చరణ్ ఎలాంటి అద్భుతమైన వినోదాన్ని అందించబోతున్నాడో చూడాలి. అతడి నుంచి ఆచార్య.. ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో భారీ వినోదాన్ని ఆశించవచ్చు. అయితే దీనికోసం ఇంకా చాలా కాలం వేచి చూడాల్సి ఉంది.
మెజీషియన్ గా చెర్రీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` షూట్ ముగించారు. తండ్రి మెగాస్టార్ తో కలిసి `ఆచార్య` చిత్రీకరణను ఒక పాట మినహా పూర్తి చేశారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తొలిసారి చరణ్- చిరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీస్ తో పాటు రామ్ చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. తాజాగా ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ తెలుగు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడానికి రామ్‌చరణ్ ని రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందు కోసం ఆయనతో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
డిస్నీప్లస్ హాట్ స్టార్ తన కార్యకలాపాలను తెలుగు భాషలో మరింత ఉదృతం చేయాలని యోచిస్తోంది. చాలా మంది వీక్షకులను ఆకర్షించడంలో భాగంగా రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని అతనితో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో భాగంగా మెజీషియన్ గా డీస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సంబంధించిన ప్రచార చిత్రంలో కనిపించనున్నారని తెలిసింది. ఈ ప్రకటనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేయబోతున్నారు. దక్షిణాదికి చెందిన నటుడు స్ట్రీమింగ్ సర్వీస్ ని ఆమోదించడం ఇదే మొదటిసారి. ఇటీవల షారూఖ్ అదే సంస్థ కోసం ఒక వీడియోలో నటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పడు అదే తరహాలో రామ్ చరణ్ తో సరికొత్త ప్రకటనని రూపొందించారు. ఇది ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
రామ్ చరణ్ మరోవైపు తన తండ్రి నటించే సినిమాలన్నిటికీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్నిటికి చరణ్ సహనిర్మాత. మరోవైపు శంకర్ - దిల్ రాజు సినిమాకి చరణ్ సహనిర్మాతగా కొనసాగే వీలుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.