Begin typing your search above and press return to search.

RRR పోలీసోడంటే ఇంత సాలిడ్ గా ఉండాలి!

By:  Tupaki Desk   |   28 Dec 2021 4:30 PM GMT
RRR పోలీసోడంటే ఇంత సాలిడ్ గా ఉండాలి!
X
సాలిడ్ పోలీస్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ పాత్ర ద్వారా తెలుగు జ‌నం తెలుసుకోబోతున్నారు. నిజానికి ట్రైల‌ర్ లో చూపించింది చాలా చిన్న‌దే. ఇక అతడు తెల్ల‌దొర‌ల త‌ర‌పున ప‌ని చేస్తూ చివ‌రికి రియ‌లైజ్ అయ్యి కొమ‌రం భీమ్ తో చేతులు క‌లుపుతాడ‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

ఇక ఇందులో రెండు మూడు విభిన్న‌మైన గెట‌ప్పులు పాత్ర‌ల‌తో చ‌ర‌ణ్ .. తార‌క్ మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నారు. ఇక‌పోతే చ‌ర‌ణ్ పోలీస్ గెట‌ప్ మాత్రం ఫెంటాస్టిక్ గా కుదిరింది. నిప్పులా చెల‌రేగే పోలీసాఫీస‌ర్ లా అత‌డు మూవీలో కొంత భాగం క‌నిపిస్తాడు.. సీతారామ‌రాజుగా విల్లంబులు అందుకుని చెల‌రేగేవాడిగానూ త‌న పాత్ర ఆహార్యం ఎంతో ఫెంటాస్టిక్ గా క‌నిపిస్తోంది. పూర్తి సినిమాలో ఈ పాత్ర ఎలివేష‌న్ ఒక రేంజులో ఉండ‌నుంది.

అత‌డు న‌డిచొస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో ఆ భ‌గ‌భ‌గలు చూస్తేనే ఆ పాత్ర‌లో ప‌వ‌ర్ ఏ రేంజులో ఉండ‌నుందో అర్థ‌మ‌వుతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో యూనిఫామ్ కి ఫిట్ గా క‌నిపిస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఈ మూవీ కోసం అత‌డి మేకోవ‌ర్ కూడా ఆ రేంజులోనే ఉంది. పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించుకునేందుకు చ‌ర‌ణ్ .. తార‌క్ ఏ రేంజులో క‌ష్ట‌ప‌డ్డారో అది తెరపై క‌నిపించ‌నుంది. జ‌న‌వ‌రి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆరోజు ఇద్ద‌రిలో ఎవ‌రు ఎంత స్పెష‌ల్ అన్న‌ది అభిమానులే క‌థ‌లు క‌థ‌లు గా చెబుతారు.