Begin typing your search above and press return to search.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఒత్తిడికి గురవుతున్నారా?
By: Tupaki Desk | 3 Jan 2022 2:30 PM GMTఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో ఈ నెల 7న విడుదల కావాల్సిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దరిమిలా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి సినిమాపై హ్యూజ్ క్రేజ్ క్రియేట్ అయిన తరువాత రిలీజ్ వాయిదా కావడంతో సినీ ప్రియులు ఆవేదనకు గురవుతున్నారు. మళ్లీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం క్రియేట్ అయిన క్రేజ్ ని మళ్లీ రీ క్రియేట్ చేయడం కష్టం. ఈ నేపథ్యంలో సినీ ప్రియుల తరహాలోనే చిత్ర హీరోలు రామ్ చఱణ్, ఎన్టీఆర్ కూడా ఒత్తిడికి గురవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా ప్రధాన సిటీలకు వెళ్లి ఏ వేదిక లభిస్తే ఆ వేదికపై `ఆర్ ఆర్ ఆర్` ని రాజమౌళితో కలిసి ప్రమోట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్స్ కోసం క్షణం తీరిక లేకుండా గడిపేసిన హీరోలు ఒక్కసారిగా వాతావరణం న్యూ ఇయర్ తరువాత మారిపోవడంతో తీవ్రర ఒత్తిడికి గురవుతున్నారట.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం `ఆర్ ఆర్ ఆర్` రీలీజ్ వాయిదా ప్రకటన తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదట. జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్ ` ప్రమోషన్స్ తో చరణ్, తారక్ మెరిశారు. చాలా హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అంతే హుషారుగా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా హ్యూజ్ సక్సెస్ అయ్యాయి. అయితే ఆ తరువాతే అన్నీ మారిపోయాయి. జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది.
డిజప్పాయింట్ అయ్యారన్నది చాలా చిన్నపదమని , ఊహించని వార్త వినడంతో చరణ్, ఎన్టీఆర్ డిప్పెషన్ లోకి వెళ్లిపోయారని వారితో సన్నిహితంగా వుండే వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ ని మించి చరణ్ చాలా ఫీలయ్యాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. చరణ్ మాత్రం అసలు ట్వీటే చేయలేదు. దీంతో చరణ్ ఎంతలా డిప్రెషన్ కు గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.
అంతేనా న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన `ఆచార్య` ఫస్ట్ సింగిల్ ప్రోమోని కూడా చరణ్ పట్టించుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జక్కన్న కూడా చాలా డిప్రెషన్ కి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా ట్విట్టర్ వేదికగా ఎలాంటి ట్వీట్ చేయకపోవడం గమనార్హం. ఇది గమనించిన ఇండస్ట్రీ వర్గాలు తాజా పరిస్థితిలో మార్పులు సంభవించి `ఆర్ ఆర్ ఆర్` టీమ్ కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాయి.
తాజా పరిస్థితుల నుంచి బయటపడి చరణ్ మళ్లీ `ఆచార్య` పనుల్లోబిజీ అవుతాడా? లేదంటే మరి కొన్ని రోజులు ఇదే మూడ్ లో వుంటాడా? అన్నది పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులు మళ్లీ మామూలుగా మారి `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కు అనుకూలించాలని, మేకర్స్ తో పాటు చిత్ర బృందానికి మళ్లీ మంచి రోజులు రావాలని ఆశిద్దాం.