Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఇన్నాళ్లకు ఒరిజినల్ చరణ్ కనిపించాడు
By: Tupaki Desk | 17 Oct 2021 6:34 AM GMTమెగా హీరో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే జనవరిలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణ నూరు శాతం పూర్తి అయ్యింది. మొన్నటి వరకు కొంత ప్యాచ్ వర్క్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల మొత్తం ముగించారు. రామ్ చరణ్ తాజా లుక్ అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అనడంలో సందేహం లేదు. దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ను నీట్ షేవ్ ట్రిమ్ మీసాలతో చూడటం జరిగింది. ఇన్నాళ్లు కూడా ఆయన గడ్డం మరియు మీసాలు చూసిన ప్రతి సారి కూడా ఆర్ ఆర్ ఆర్ లోని అల్లూరి సీతారామరాజు పాత్ర గుర్తుకు వచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ ఒరిజినల్ లుక్ ను చూశామంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
నాట్యం సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. అదే సమయంలో ఆయన గడ్డం లేకుండా.. చాలా తక్కువ మీసాలతో కనిపించాడు. రామ్ చరణ్ లుక్ మరియు ఫిజిక్ కూడా మారడంతో ఇదంతా కూడా శంకర్ సినిమా కోసం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు ముగించుకున్న వీరి కాంబో మూవీ వచ్చే ఏడాది నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించేశాడనే టాక్ వినిపిస్తుంది. మొదటి షెడ్యూల్ కోసం పుణె వెళ్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు రామ్ చరణ్ శంకర్ ల మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ను మాత్రం ఇవ్వలేదు.
రామ్ చరణ్ తన శంకర్ మూవీని ఇంకా ప్రారంభించకుండానే తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అంటూ ప్రకటించాడు. అంటే ఖచ్చితంగా శంకర్ దర్శకత్వంలో సినిమా చాలా స్పీడ్ గా ముగించబోతున్నారు. మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న వార్తల అనుసారం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 2022 ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే నటించేందుకు డేట్లు ఇచ్చాడట. గౌతమ్ తిన్ననూరి తో సినిమా మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ మూవీ ఉంటుందనే విషయం ఇప్పటికే తేలిపోయింది. దానయ్య ఆ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న ఈ సమయంలో ఆయన లుక్ మారడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా చూస్తున్న లుక్ లో కాకుండా విభిన్నంగా ఈసారి చరణ్ ను చూడటం పట్ల చాలా మంది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.