Begin typing your search above and press return to search.

RC 15: ఈ డేట్ అయినా ఫిక్స్ అవుతుందా?

By:  Tupaki Desk   |   23 Oct 2022 9:16 AM GMT
RC 15: ఈ డేట్ అయినా ఫిక్స్ అవుతుందా?
X
రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో కూడా మరో సక్సెస్ చూడాలని కోరుకున్నాడు. కానీ అందుకు భిన్నంగా ఆచార్య బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అసలు ఆ రేంజ్ లో ఆచార్య సినిమా బ్లాస్ట్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కువగా శంకర్ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.

RC 15 తప్పకుండా ఆకట్టుకుంటుంది ఇదివరకే దిల్ రాజు కూడా ఎంతో నమ్మకంతో తెలియజేశాడు. ఇప్పటివరకు దిల్ రాజు ఏ సినిమా కోసం కూడా ఖర్చు పెట్టని విధంగా రాంచరణ్ 15 సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించాడు. ఇక సంచలన దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే గత కొంత కాలంలో శంకర్ కు సరైన సక్సెస్ లేదు కాబట్టి ఈ సినిమాతోనే ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.

అయితే ఈ సినిమాను మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ ఇంకా రిలీజ్ విషయంలో అయితే పెద్దగా క్లారిటీకి రాలేదు. అనుకోకుండా శంకర్ ఆగిపోయిన ఇండియన్ 2 ప్రాజెక్ట్ మొదలు కావడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ బ్రేకులు పడుతున్నాయి. ఏదో ఒక రకంగా ఫినిష్చేయాలని శంకర్ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ శంకర్ హఠాత్తుగా కమల్ హాసన్ సినిమాను మళ్లీ రీస్టార్ట్ చేయడంతో ప్లాన్ ఒక్కసారిగా చేంజ్ అయింది. ఇంకా 40 శాతానికి పైగా షూటింగ్ మిగిలి ఉండడంతో అప్పటివరకు సినిమాను విడుదల చేయడం కష్టమని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని కోరుకున్నారు. అప్పటి కూడా కుదరడం లేదు అని తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసం కూడా కనీసం నెల రోజులు సమయం గ్యాప్ ఉండాలి కాబట్టి ఏప్రిల్ అయితే బెటర్ అని అనుకుంటున్నారు.

అప్పటిలోపు హాలిడేస్ మొదలవుతాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది అని నమ్మకంతో ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. అయితే దిల్ రాజు ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు శంకర్ మాత్రం ప్రతిసారి ఏదో ఒక కారణం చేత ఆలస్యం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అనుకున్నా డేట్ కు తగ్గట్టుగా అయితే షూటింగ్ చేయాలి అని శంకర్ కూడా అనుకుంటున్నాడట. మరి ఆ ప్లాన్ కు తగ్గట్టుగా సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి.