Begin typing your search above and press return to search.

హిందీ 'జెర్సీ' ఎఫెక్ట్‌.. చరణ్‌ నిర్ణయం మార్చుకున్నాడా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 11:30 PM GMT
హిందీ జెర్సీ ఎఫెక్ట్‌.. చరణ్‌ నిర్ణయం మార్చుకున్నాడా?
X
రామ్‌ చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న శంకర్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాను చేయబోతున్నట్లుగా ఆ మధ్య అధికారికంగా ప్రకటన వచ్చింది. రామ్‌ చరణ్ బర్త్ డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ వారు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు.

రామ్ చరణ్‌ మరియు శంకర్ కాంబినేషన్‌ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. షూటింగ్ కు మరి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో గౌతమ్ తిన్ననూరి మరో హీరో కోసం చూస్తున్నాడని... ఇటీవల ఒక యంగ్‌ హీరోకు ఆయన కథ చెప్పేందుకు వెళ్లాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రామ్‌ చరణ్ తో సినిమా కమిట్ అయిన తర్వాత మరో హీరో కు కథ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిందీ జెర్సీ విడుదల అయిన తర్వాత రామ్‌ చరణ్ నిర్ణయంలో మార్పు వచ్చిందని.. గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయడం వల్ల పాన్ ఇండియా మార్కెట్‌ ఉండక పోవచ్చు అని చరణ్ భావిస్తున్నాడట.

అందుకే రామ్‌ చరణ్ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరిని హోల్డ్‌ లో పెట్టడంతో చేసేది లేక దర్శకుడు మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన హిందీ జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే దక్కించుకుంది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్ల ను రాబట్టడం లో విఫలం అయ్యింది.

అందుకే ఇప్పుడు చరణ్‌ మరియు గౌతమ్ తిన్ననూరి సినిమా కి నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ గురించి వస్తున్న పుకార్ల కు యూవీ క్రియేషన్స్ నుండి ఏమైనా స్పందన వస్తుందా అంటూ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్ ఒక వేళ గౌతమ్ తిన్ననూరి సినిమాను క్యాన్సిల్‌ చేస్తే తదుపరి సినిమా ఏమై ఉంటుంది అనేది కూడా ఆసక్తికర చర్చ.