Begin typing your search above and press return to search.
చరణ్ - శంకర్ మూవీలో ఆ ఫ్రీడమ్ ఫైటర్ కూడానా?
By: Tupaki Desk | 25 Oct 2022 1:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `RRR` వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50వ ప్రాజెక్ట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా తమిళ దర్శకుడు ఎస్ జె. సూర్య నటిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
సెమీ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో రామ్ చరణ్ తండ్రిగా, తనయుడిగా రెండు విభిన్నమైన కాలాల్లో సాగే పాత్రల్లో కనిపించబోతున్నారు. 90వ దశకం నేపథ్యంలో జరిగిన పలు రాజకీయాంశాలకు నేటి వాతావరణానికి లింకప్ చేస్తూ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తయిందని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని శంకర్ RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కమల్ `ఇండియన్ 2` షూటింగ్ మళ్లీ మొదలైన కారణంగా ఈ మూవీ షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి తాజాగా ఫిలింస్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. స్వాంత్య్ర సమరంలో వీరోచితంగా పోరాడిన యోధుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఆయన స్ఫూర్తితో స్వాంత్య్ర సమరంలో పాలు పంచుకున్న ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ మూవీని శంకర్ ఓ ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడట.
ఈ నేపథ్యంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సన్నివేశాల్ని కూడా ఈ మూవీలో చూపించబోతున్నారట. తండ్రి పాత్రలో నటిస్తున్న చరణ్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సన్నివేశాలని చూపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఆ పాత్రకు సబంధించిన డైలాగ్స్, వేషధారణపై దర్శకుడు శంకర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఓ పాత్రలో తండ్రిగా రామచంద్రన్ అనే పొలిటికల్ లీడర్ గా కనిపించనుండగా, మరో పాత్రలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. ఇటీవల లీకైన ఫొటోలు సినిమాపై అంచనాల్ని పుంచేసి చరణ్ పాత్ర హైలైట్ గా వుండనుందనే సంకేతాల్ని అందించింది.