Begin typing your search above and press return to search.
RC15 : చరణ్ కి నాన్ ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్
By: Tupaki Desk | 30 Oct 2022 3:30 PM GMTఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పై అందరి దృష్టి ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రాజమౌళి కి ఏమాత్రం తగ్గడు అంటూ శంకర్ పై మెగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
వందల కోట్ల వసూళ్లను చరణ్.. శంకర్ కాంబో మూవీ రాబట్టడం కన్ఫర్మ్ అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ సీ 15 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను యూఎస్ లో అన్ని ఇండియన్ భాషల్లో విడుదల చేయడానికి మంచి డిమాండ్ ఉంది.
ఈ సినిమా ను నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పటికే సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ను మొదలు పెట్టేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమా యొక్క యూఎస్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ పంపిణీ సంస్థకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్న దాని ప్రకారం ఆర్ సీ 15 సినిమాను యూఎస్ లో పంపిణీ చేసేందుకు గాను దాదాపుగా 17.2 కోట్ల రూపాయలను సదరు సంస్థ దిల్ రాజుకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుందట.
ఆర్ ఆర్ ఆర్ సినిమా కాకుండా రామ్ చరణ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో యూఎస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. దాంతో చరణ్ నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డును నమోదు చేశాడు అంటూ మెగా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆర్ సీ 15 సినిమా తో కలెక్షన్స్ విషయంలో కూడా నాన్ ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డును చరణ్ దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయిదు వందల కోట్లకు పైగా చరణ్ ఈ సినిమా తో రాబడితే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.