Begin typing your search above and press return to search.
వారికి రామ్ చరణ్ సెల్యూట్
By: Tupaki Desk | 23 Oct 2021 8:30 AM GMTకరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ సమయంలో మెడికల్ టీమ్ చేసిన సేవ కారణంగానే ఎంతో మంది ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు అనడంలో సందేహం లేదు. దేశంలోని వైధ్య సిబ్బంది మొత్తం కూడా తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కరోనాతో పోరాటం సాగించారు. వారికి ఎంత ఇచ్చినా తక్కువే.. ఏం చేసినా తక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు కరోనాతో పోరాటం సాగిస్తూనే మరో వైపు కరోనా వ్యాక్సిన్ ను జనాలకు ఇవ్వడంలో వైధ్య సిబ్బంది సూపర్ సక్సెస్ అయ్యారు. తక్కువ సమయంలోనే వంద కోట్ల డోసులను ఇండియాలో ఇచ్చిన ఘనత వైధ్య సిబ్బందికి దక్కింది. డాక్టర్లతో పాటు కింది స్థాయి సిబ్బంది మరియు వైధ్యాధికారులు అంతా కూడా ఈ మహా కార్యంలో పాలు పంచుకుని విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇండియాలో వంద కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్బంగా వైధ్య సిబ్బందిని ఎంతో మంది ప్రముఖులు అభినందించారు. ప్రథాని నరేంద్ర మోడీతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ విషయమై స్పందించారు. ఈ విషయమై మెగా హీరో రామ్ చరణ్ కూడా స్పందించాడు. ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ టీమ్ లోని ప్రతి ఒక్కరికి నా సెల్యూట్. ఒక అద్బుతమైన చారిత్రాత్మక ఘనతను మీరు దక్కించుకున్నారు అంటూ మెడికల్ సిబ్బందిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ట్విట్టర్ లో రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరిలో ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతుంది. ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేసిన చరణ్ ఆ సినిమాతో ఫిబ్రవరిలో రాబోతున్నాడు. మరో వైపు శంకర్ దర్శకత్వంలో సినిమాను నిన్నటి నుండే మొదలు పెట్టాడు. రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో మూవీ ప్రస్తుతం పుణె లో భారీ ఎత్తున వేసిన ఒక సెట్టింగ్ లో జరుగుతోంది. అక్కడ రెండు వారాల పాటు షూటింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది.