Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 15.. ఇలా అయితే మరో సంక్రాంతికే!

By:  Tupaki Desk   |   1 Jan 2023 3:30 PM GMT
రామ్ చరణ్ 15.. ఇలా అయితే మరో సంక్రాంతికే!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. గత ఎడాది RRR ఆర్ సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్న రాంచరణ్ ఆ తర్వాత మళ్లీ వెంటనే తన తండ్రితో చేసిన ఆచార్య సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు 2023లో మాత్రం శంకర్ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయంలో అయితే చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఆలస్యం చేస్తున్నారు. అసలైతే RC 15 సినిమాను ఈ ఏడాది జనవరి సంక్రాంతి లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా శంకర్ ఇండియన్ 2 సినిమాను మళ్లీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో రామ్ చరణ్ సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

అయితే ఇండియన్ 2 సినిమా అయితే 2023 జూన్లో రాబోతోంది. అయితే దిల్ రాజు కూడా రామ్ చరణ్ సినిమాను ఇదే ఏడాది లోనే విడుదల చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇండియన్ 2 సినిమా షెడ్యూల్ ను బట్టి రామ్ చరణ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ రామ్ చరణ్ 15 సినిమాల విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

అది కుదరకపోతే డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ ను టార్గెట్ చేయబోతున్నారు. ఇక అప్పుడు కాకుండా 2023 సంక్రాంతిని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సినిమాను కరెక్ట్ హాలిడే సీజన్లోనే విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. అలా మాత్రం గట్టిగా ఆలోచిస్తే సంక్రాంతి ఆయనకు బెస్ట్ ఆప్షన్. దీన్ని బట్టి సినిమా 2024 సంక్రాంతికి రావచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న మాత్రం సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది.