Begin typing your search above and press return to search.
బన్నీ కంటే చరణ్ కి ముందు చూపెక్కువ!
By: Tupaki Desk | 12 Jun 2022 11:55 AM GMTఐకాన్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ కి ముందు చూపెక్కువంటారా? బన్నీ కంటే చరణ్ ఇంకొంచెం ప్లానింగ్ తో ముందుకెళ్తుంటారా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇన్నాళ్లు లేని డౌట్స్ ఇప్పుడు ఎందుకు రెయిజ్ అయినట్లు. అంటే అంతా పాన్ ఇండియా మహిమేనని తెలుస్తోంది. అవును. `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోక ముందే చరణ్ ఎంతో ప్లానింగ్ తో ప్యూచర్ ప్రాజెక్ట్ ల్ని రెడీ చేసిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
`ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో ఉండగానే దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. శంకర్ తో సినిమా చేయడమే చాలా కష్టమైన పని. కానీ చరణ్ ఆ విషయంలో చాలా తెలివిగా..ముందు చూపుగా వ్యవహరించి శంకర్ సినిమాలో భాగమయ్యారు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కాగానే ఆ చిత్రాన్ని సెట్స్ పైకి కి తీసుకెళ్లారు.
ఇది పాన్ ఇండియా కేటగిరీ చిత్రం. సినిమా హిట్ అయితే చరణ్ ఇమేజ్ పాన్ ఇండియాలో రెట్టింపు అవుతుంది. ఇక ఈ సినిమా సెట్స్ లో ఉండగానే `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే స్ర్కిప్ట్ లాక్ చేసి అందులో మార్పులు..చేర్పులు సూచించి ఫైనల్ గా శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగానే గౌతమ్ సినిమా ప్రకటనొచ్చేలా జాగ్రత్త పడ్డారు.
ఇది కూడా యూనివర్శీల్ అప్పీల్ ఉన్న స్ర్కిప్ట్. పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఇలా చరణ్ ఎంతో ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఓ సారి ఐకాన్ స్టార్ బన్నీ విషయానికి వెళ్తే అతని వెనుకబాటు తనం కనిపిస్తుందని ఫ్యాన్స్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. `పుష్ప` `దిరైజ్` రిలీజ్ అయి నెలలు గడుస్తుంది.
ఇప్పటి వరకూ రెండవ భాగం సెట్స్ కి వెళ్లలేదు. జులైలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. అదీ పక్కాగా క్లారిటీ లేదు. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లు చేయగల్గితే `పుష్ప -2`ని వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే ఏడాది చరమాంకానికి కానీ రిలీజ్ కాదు. ఇది గాక కొత్త ప్రాజెక్ట్ లు ఏవైనా బన్నీ లైన్ లోకి తెస్తున్నాడా? అంటే అది ఎక్కడా కనబడలేదు.
`పుష్ప-2` తప్ప మరో కొత్త ప్రాజెక్ట్ ఇప్పటివరకూ ఒకటి కూడా వినిపించలేదు. స్టార్లు అంతా ఎంతో ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తుంటే బన్నీ మాత్రం అందుకు దూరంగా..భిన్నంగా కనిపిస్తున్నాడు అన్న విమర్శ తెరపైకి వస్తుంది. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బన్నీ కన్నా చరణ్ బెటర్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ రిమార్క్ నుంచి బన్నీ ఎలా బయటపడతారో చూడాలి.