Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ EMK క్విజ్ షోకి మొదటి గెస్ట్ ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 15 July 2021 1:30 PM GMTబుల్లితెరపై క్విజ్ షోలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు లోగిళ్లలో కాంపిటీటివ్ స్పిరిట్ ని రాజేసేందుకు ఇది ఉపకరిస్తుంది. ఆరంభంలో క్విజ్ ఎంతో ఈజీగా కనిపిస్తున్నా.. షో రన్ అయ్యే కొద్దీ కాస్త కాంప్లికేటెడ్ ప్రశ్నలతో సవాల్ గా మారడం .. షో పార్టిసిపెంట్స్ మేధోతనాన్ని ఎలివేట్ చేసేందుకు ఉన్న ఆస్కారం వగైరా ఉత్కంఠను పెంచుతాయి. కోటి ప్రైజ్ మనీ గెలుచుకునే సత్తా ఉన్న విజ్ఞాని ఎవరు? అన్నది తెలుసుకోవాలన్న తపన పెద్ద ఎత్తున వ్యూవర్ షిప్ ని తీసుకు వస్తుందని ప్రూవైంది.
ఇక ఇదే కేటగిరీలో బాలీవుడ్ లో `కౌన్ బనేగా కరోడ్ పతి` పెద్ద సక్సెసైంది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ షోని బుల్లితెరపై చాలా కాలంగా విజయవంతంగా నడిపించిన ఘనతను దక్కించుకున్నారు. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి స్ఫూర్తితోనే తెలుగులోనూ క్విజ్ షో మొదలైంది. తెలుగు నాట టీవీ సీరియళ్ల ను సైతం వదిలేసి చూసేంతగా `మీలో ఎవరు కోటీశ్వరులు షో` సక్సెసైంది.
మీలో ఎవరు కోటీశ్వరులు స్టార్ మాలో మొదలవ్వగా ఆరంభ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేశారు. అది బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జున మరో రెండు సీజన్లకు హోస్టింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి మూడో సీజన్ కి హోస్ట్ గా కొనసాగారు. స్టార్ -మాలో ఈ షో నాలుగు సీజన్లు దిగ్విజయంగా కొనసాగాయి. అయితే ఎంఇకే పూర్తిగా మాస్ షో కాదు.. క్లాస్ షో అన్న టాక్ వినిపించడం కొంతవరకూ మైనస్ అయ్యింది.
ఏదేమైనా టీర్పీ అత్యంత కీలకంగా మారే ఈ చోట ఆకస్మికంగా క్విజ్ షోని స్టార్ మా రద్దు చేసింది. ఇటీవల కొంత గ్యాప్ తర్వాత తిరిగి తీసుకు వస్తారనే భావించినా కానీ `స్టార్ మా` యాజమాన్యాల్లో బిగ్ బాస్ సీజన్లపై ఉన్న ఆసక్తి క్విజ్ షోపై లేనేలేదని ప్రూవైంది. బుల్లితెరపై మాస్ లో అగ్గి రాజేసిన బిగ్ బాస్ పెద్ద స్థాయిలో టీఆర్పీలను తెస్తున్న సంగతి తెలిసినదే. ఎంఈకే ప్రభ తగ్గడానికి కూడా ఇది ఒక కారణం.
ఆ క్రమంలోనే జెమిని టీవీ ఈ క్రేజీ క్విజ్ షోని టేకోవర్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగింది. అయితే జెమినిలో ఈ షో టైటిల్ మరింది. MEK కాస్తా EMK గా రూపాంతరం చెందింది. మీలో ఎవరు కోటీశ్వరుడు? స్థానంలో `ఎవరు మీలో కోటీశ్వరులు?` అంటూ లాజికల్ గా టైటిల్ ని మార్చారు. ఈ టైటిల్ పై కొన్నాళ్ల పాటు వివాదం కొనసాగింది. చివరికి జెమిని చానెల్ టైటిల్ ని వోన్ చేసుకుంది. చానెల్ మారింది.. దానికి తగ్గట్టే ఈ మార్పు కూడా అని అందరికీ అర్థమైంది.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరుడు? కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తుండడంతో బోలెడన్ని అంచనాలేర్పడ్డాయి. ఎవరు మీలో కోటీశ్వరుడు? ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటికే ప్రమో రిలీజ్ చేయగా అది అభిమానుల్లో వైరల్ అయ్యింది. ``మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో .. ఎవరు మీలో కోటీశ్వరులు త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది.. సిద్ధంగా ఉండండి`` అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పి షోపై అంచనాలు పెంచిన తారక్ ఇటీవల షూట్ లో పాల్గొన్నారని తెలిసింది. పది ఎపిసోడ్ లను తొలిగా చిత్రీకరిస్తున్నారట. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు షోకు నాలెజ్ బేస్డ్ లో కంటెంస్టెంట్ల ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికే తారక్ పై లుక్ టెస్ట్ పూర్తి చేసి షూటింగుకి ఏర్పాట్లు చేస్తున్నారని హోస్ట్ కాల్షీట్లు కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి షో టెలీకాస్ట్ కానుందని సమాచారం అందింది.
మొదటి గెస్ట్ ఎవరో తెలుసా?
ఇంతలోనే `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకి తొలి గెస్ట్ ఎవరు? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా సమాచారం మేరకు తారక్ స్నేహితుడు.. ఆర్.ఆర్.ఆర్ కోస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా విచ్చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ దీనిపై జెమిని వర్గాలు ఎలాంటి క్లూని ఇవ్వకపోయినా అభిమానులు ఎవరికి వారు గెస్ చేస్తున్నారు.
ప్రస్తుత క్రైసిస్ వల్ల పది ఎపిసోడ్ల వరకూ వేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలన్న టార్గెట్ ఉంది. షూటింగ్ ను రెండు మూడు రోజుల్లోనే ప్రారంభించనున్నారని తెలిసింది. వెంటనే తారక్ - చరణ్ లు కలిసి ఉండే ప్రోమోతో ప్రమోషన్స్ పరంగా హీట్ పెంచుతారా? అన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.