Begin typing your search above and press return to search.

20ఏళ్ల క్రిత‌మే న‌ట‌న విర‌మించ‌డానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   9 Jan 2022 5:30 AM GMT
20ఏళ్ల క్రిత‌మే న‌ట‌న విర‌మించ‌డానికి కార‌ణం?
X
సినిమా అనేది మాస్ మీడియం.. ఇక్క‌డ ఎవ‌రికి వారు త‌మ‌కంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఎద‌గాలి. ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్ కృష్ణ త‌ర్వాత‌ మహేష్ దూసుకెళ్లినంత‌గా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంలో వేరొక‌రు దూసుకురాలేద‌నే చెప్పాలి. నిజానికి మ‌హేష్ కంటే చాలా ముందే ర‌మేష్ బాబు న‌టుడిగా కృష్ణ వార‌స‌త్వాన్ని కొన‌సాగించారు. బాల‌న‌టుడిగా కొన‌సాగి.. హీరోగా రాణించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే ఆయ‌న చేసిన సినిమాల సంఖ్య చాలా త‌క్కువ‌. అర‌డ‌జ‌ను సినిమాల్లో బాల‌న‌టుడిగా కొనసాగిన ర‌మేష్ బాబు హీరోగా కేవ‌లం ప‌దిహేను సినిమాలు మాత్ర‌మే చేశారు. వీటిలో కొన్ని హిట్లు ఉన్నాయి. ఇక‌పోతే బాల‌న‌టుడిగా ఆయ‌న త‌న తండ్రి గారు కృష్ణ‌తో క‌లిసి న‌టించిన‌వే ఎక్కువ‌. కృష్ణ బాల్యం పాత్ర‌ల‌తో ర‌మేష్ బాబు ప్ర‌స్థానం కొన‌సాగింది. ఆ త‌ర్వాత దాస‌రి.. జంధ్యాల‌.. కోదండ రామిరెడ్డి.. టి.రాజేందర్ (త‌మిళం) వంటి దిగ్గ‌జద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం త‌న‌కు ద‌క్కింది. విజ‌యాల్ని అందుకున్నారు. ఇటు తెలుగు అటు త‌మిళ చిత్ర‌రంగాల్లో ర‌మేష్ బాబుకు గొప్ప ప‌రిచ‌యాలున్నాయి. కృష్ణ వార‌సుడిగా అత‌డు ఎదిగేందుకు చాలా స్కోప్ ఉన్నా కానీ ఈ మాస్ మీడియంలో సౌమ్యుడైన‌ ఆయ‌న ఒద‌గ‌లేక‌పోయార‌ని గుస‌గుస‌లు వినిపించేవి. కాల‌క్ర‌మంలో న‌టన‌పై ఆయ‌న‌లో ఆస‌క్తి స‌న్నగిల్లింది. దాదాపు ఇర‌వై ఏళ్ల క్రిత‌మే న‌ట‌నను విర‌మించారు.

కొంత గ్యాప్ త‌ర్వాత‌ నిర్మాత‌గా ప్ర‌య‌త్నించారు. కానీ అక్క‌డా నిల‌దొక్కుకోలేదు. దీనికి కార‌ణం సినీరంగంలో మారిన ప‌రిస్థితులు వ‌గైరా వ‌గైరా అని చెబుతుంటారు. సినీరంగంలో ర‌క‌ర‌కాల గాసిప్పులు గుస‌గుస‌లు కూడా అంద‌రికీ న‌చ్చ‌వు. ర‌మేష్ బాబు వీట‌న్నిటికీ దూరంగా ఉండేందుకు లైమ్ లైట్ లో ఉండేందుకు.. అన‌వ‌స‌ర హంగామాతో గ్లామ‌ర్ ఒల‌క‌బోసేందుకు ఎప్పుడూ ఆస‌క్తిగా లేరు. ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో తండ్రి బాట‌లోనే ఆయ‌న కుటుంబానికే ఎక్కువ స‌మ‌యం కేటాయించేవార‌ని చెబుతారు. దీనివ‌ల్ల కూడా ఈ రంగంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఎన్నో వ్య‌క్తిగ‌త‌ కార‌ణాల‌తో అత‌డు న‌ట‌న‌ను విర‌మించారు. 56 వ‌య‌సులో అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ర‌మేష్ బాబు ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.