Begin typing your search above and press return to search.

వర్మ 400 మంది గర్ల్స్‌ తో డేట్ చేశారట నిజమేనా..?

By:  Tupaki Desk   |   17 Dec 2022 4:44 PM GMT
వర్మ 400 మంది గర్ల్స్‌ తో డేట్ చేశారట నిజమేనా..?
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. అషు రెడ్డి ఇంటర్వ్యూ తర్వాత ఆయన వ్యవహార శైలి విమర్శల పాలు అయ్యింది. ఆ ఇంటర్వ్యూ లో తన వ్యాఖ్యలు మరియు ప్రవర్తనకు వివరణ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు మరింతగా వివాదాన్ని రాజేశాయి. ఈ సమయంలో రామ్‌ గోపాల్ వర్మ మరో ఇంటర్వ్యూ ఆయన్ను వార్తల్లో నిలిపింది.

ఆ ఇంటర్వ్యూ కాస్త బోల్డ్‌ గా ఉండటం.. ఇంటర్వ్యూవర్‌ బోల్డ్‌ గా ప్రశ్నలు అడగడా వర్మ అంతకు మించి బోల్డ్‌ గా టపీ టపీ అంటూ సమాధానాలు చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం వర్మ ఇచ్చిన బోల్డ్‌ ఆన్సర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మాయిల నుండి సినిమాల వరకు అనేక విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో చర్చ జరిగింది.

వోడ్కా తాగుతూ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ ఎప్పటిలాగే ఆయన అభిమానులకు కిక్‌ ఇస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇవేం బూతు మాటలు.. ఇవేం చెత్త మాటలు అంటూ ఆయన తీరును విమర్శిస్తున్నారు. వర్మ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలో... ఇప్పటి వరకు మీరు 400 మంది అమ్మాయిలతో డేట్‌ చేశారు అంటూ ప్రచారం ఉంది.. నిజమేనా? అంటూ ప్రశ్నించగా 40 ఏళ్ల లో ఆ నెంబర్‌ పెద్దది ఏం కాదు అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. అషు రెడ్డితో ఇంటర్వ్యూ కనుక అక్కడితో ఆగారా కెమెరా లేకుంటే ఇంకా ముందుకు వెళ్తారా అంటూ ప్రశ్నించాడు. అప్పుడు వర్మ స్పందిస్తూ తాను ఏ విషయాన్ని కూడా దాచుకోను.. ఆపుకోను అన్నాడు.

ఇక పోలీసు కేసులతో కంటే ఈ మధ్య కాలంలో మహిళ సంఘాల వారితో మీకు ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్లుంది అంటూ ప్రశ్నించగా.. తాను ఏ ఒక్కరిని పట్టించుకోను అన్నాడు. మీరు చివరి సారి సెక్స్ ఎప్పుడు చేశారు అంటూ ప్రశ్నించగా స్టుపిడ్ క్వశ్చన్ అంటూ వర్మ సమాధానం ఇచ్చాడు.

ఇక జగన్ ను ఎందుకు కలిశారు అంటూ ప్రశ్నించగా ఆ విషయం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం అన్నట్లుగా వర్మ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి వర్మ ఇచ్చిన ఆన్సర్స్‌ భలే ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.