Begin typing your search above and press return to search.

ప్యూర్ జెమ్.. పర్ఫెక్ట్ సిఎం..

By:  Tupaki Desk   |   24 March 2018 10:16 PM IST
ప్యూర్ జెమ్.. పర్ఫెక్ట్ సిఎం..
X
టాలీవుడ్ లో సినిమాపై ఒక్క సారి అంచనాలు పెరిగాయంటే చాలు ఇక అభిమానులకు పండగే. స్టార్ హీరోల సినిమా గురించి ఒక్క పాజిటివ్ కామెంట్ ఎవ్వరు చేసినా సరే అభిమానుల చూపు వారివైపుకు కూడా వెళుతుంటుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అభిమానులందరు ఒక వ్యక్తి వైపే చూస్తున్నారు. అతను ఎవరో కాదు. సినిమాకు ప్రాణమైన పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి.

రామజోగయ్య శాస్త్రి అంటే హీరోల క్రేజ్ కి తగ్గట్టు పదాలను ఒక్కొక్కటిగా అల్లి అదిరిపోయే పులా మాల లాంటి పాటను రాసేస్తారు. ఫైనల్ గా ఆడియెన్స్ దగ్గరికి వచ్చే సరికి మరో రేంజ్ కి వెళుతుంది. ఇకపోతే సినిమా రిలీజ్ కోసం దర్శకుడు కొరటాల హీరో మహేష్ ఎంత హడావుడి చేస్తున్నారో తెలియదు గాని గేయ రచయితగా వర్క్ చేసిన రామజోగయ్య గారు మాత్రం పెద్ద హాంగామానే చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని రోజు ప్రస్తావిస్తూ ఆకర్షిస్తున్నారు. రీసెంట్ గా చేసిన ట్వీట్ లో అయితే రామయ్య గారి డోస్ కొంచెం ఎక్కువయినట్లు తెలుస్తోంది. అతని గుండె లోపల నుండి ప్రతి గుండెను టచ్ చేస్తాడు - ప్యూర్ జెమ్ - పర్ఫెక్ట్ సిఎం - అతని కన్విక్షన్ ను చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ తనదైన శైలిలో పదాలను ప్రయోగించారు. ఈ ట్వీట్స్ కి ఘట్టమనేని అభిమానులు కూడా వారి స్టైల్ లో సూపర్బ్ అనేస్తున్నారు.