Begin typing your search above and press return to search.
పెద్దయన చేతికి బాహుబలి శాటిలైట్??
By: Tupaki Desk | 13 July 2015 5:40 AM GMTకేవలం మూడు రోజుల్లోనే 160కోట్లు పైగా గ్రాస్ ఆర్జించి రికార్డుల్ని తిరగరాసింది బాహుబలి. ఈ సినిమా తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళ్‌లోనూ దుమ్ము దులిపేస్తోంది. ఓవర్సీస్‌లో మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. ఈ సక్సెస్ నేపథ్యంలో శాటిలైట్ హక్కుల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది.
ఇప్పటికే మాటీవీ, జెమినీ టీవీ భారీ మొత్తాల్ని ఆఫర్ చేశాయని చెబుతున్నారు. అయితే రామోజీరావుపై గౌరవంతో, అభిమానంతో ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఈటీవీకే కట్టబెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. పోటీబరిలో మిగతా టీవీ చానెళ్లు 15కోట్ల భారీ మొత్తాల్ని ఆఫర్ చేస్తున్నా అంతకంటే తక్కువ మొత్తానికే ఈ చిత్రాన్ని ఈటీవీకి అప్పగిస్తున్నారట. అయితే దీనికి కారణమేంటో అందరికీ తెలిసిందే.
బాహుబలి మెజారిటీ భాగం రామోజీ ఫిలింసిటీలోనే తెరకెక్కింది. రామోజీ నుంచి అన్నివేళలా తగిన సహకారం అందింది. పైగా బాహుబలి పెట్టుబడుల్లో పరోక్షంగా ఆయన సాయం చాలా ఉంది. కాబట్టి శాటిలైట్‌ని ఆయనకే ఇస్తే తప్పేం ఉందని రాజమౌళి భావిస్తున్నాడని తెలుస్తోంది. రామోజీ-రాజమౌళి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ వల్ల బాహుబలి ఈటీవీకే దక్కుతుందనడంలో సందేహమే లేదు. కాస్త నష్టమే అయినా రామోజీకే బాహుబలి శాటిలైట్ హక్కులు రాసిస్తారని అనుకోవచ్చేమో.