Begin typing your search above and press return to search.
బాహుబలి శాటిలైట్ రైట్స్ కు చిక్కొచ్చిందా
By: Tupaki Desk | 17 July 2015 4:45 AM GMTప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొట్టడంలో సిసలైన బాహుబల భుజభల సంపన్నుడుగా పేరు తెచ్చుకున్నాడు బాహుబలి. కానీ ఓ విషయంలో మాత్రం దారుణంగా ఫెయిలయ్యాడని చెబుతున్నారు. బాహుబలి శాటిలైట్ హక్కులు విక్రయించడం పెద్ద సమస్యగా తయారైందని చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. అంతేనా .. ఇది నాది అన్నంతగా ప్రచారం చేసిన రామోజీరావే శాటిలైట్ హక్కుల్ని కొనుక్కోవడానికి వెనకాడారని తెలుస్తోంది. వివరాల్లోకి డీప్‌గా వెళితే..
బాహుబలి సక్సెస్ దృష్ట్యా, కలెక్షన్ల దృష్ట్యా ఈ సినిమా శాటిలైట్ భారీ మొత్తం పలుకుతుందని ఆర్కామీడియా భావించింది. మాటీవీ 12కోట్లు చెల్లించుకోవడానికి సిద్ధమైంది. అయితే 14కోట్లు చెల్లిస్తేనే హక్కులు అంటూ నిర్మాతలు వెనుకంజ వేశారు. దాంతో సదరు చానెల్ వెనక్కి తగ్గింది. కట్ చేస్తే ఈటీవీ అధినేత రామోజీరావుకి తక్కువ రేటుకే శాటిలైట్ కట్టబెట్టడానికి శోభు యార్లగడ్డ ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇదే విషయమై ఆరాతీస్తే అసలు సంగతి బైటపడింది.
బాహుబలి కోసం రామోజీరావు దాదాపు 70కోట్లు పెట్టుబడి పెట్టారు. అందులో 26కోట్లు నిర్మాతలు వెంటనే చెల్లించాల్సి ఉంది. అయితే దీనిలో శాటిలైట్ సగం కట్ చేసుకుని బ్యాలెన్స్ ఇస్తామని అంటే రామోజీ ససేమిరా అన్నారట. అంతేనా కేవలం డబ్బు రూపంలో మాత్రమే తీసుకుంటానని అన్నారట. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు సాగుతున్నాయని సమాచారం. అసలు బాహుబలి టీవీక్షకులకు సూటబుల్ కాదు. అందుకే పోటీ లేదని చెబుతున్నారు. ఏది నిజం? అసలేం జరుగుతోంది? అన్నది నిర్మాతలే వెల్లడించాల్సి ఉంది.