Begin typing your search above and press return to search.
రామోజీ ది రియల్ ఇన్వెస్టర్
By: Tupaki Desk | 10 July 2015 4:40 PM GMTబాహుబలిలో రామోజీరావు పెట్టుబడులున్నాయి.. ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్. రామోజీ కోట్ల కొద్దీ సొమ్ముల్ని బాహుబలిలో పెట్టుబడులుగా పెట్టారు. అందుకే ఇటీవలి కాలంలో ఈ చిత్రానికి ఈనాడు పత్రిక, ఈటీవీలో బోలెడంత ప్రచారం చేస్తున్నారు. అయితే రామోజీ వాటా ఎంత, రామోజీ ఫిలింసిటీ సాయం ఎంత, అన్న దానిపై రకరకాలుగా ముచ్చటించుకుంటున్నారు.
కొందరైతే ఈ సినిమా రెండు భాగాల చిత్రీకరణ కోసం రామోజీ దాదాపు 100 కోట్లు సమకూరుస్తున్నారని చెబుతున్నారు. అయితే అది రకరకాల మార్గాల్లో వస్తోంది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రమేయం కూడా ఉందట. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేసుకున్నందుకు ఆ మొత్తాన్ని బాహుబలి బృందం రిలీజ్ ముందే చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఫైనాన్స్ రూపంలో దానిని సర్ధుబాటు చేసుకున్నారట. తరువాత లాభాల్లోంచి షేర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదంతా నిజమే అన్నట్టు 'రామోజీరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు' అంటూ టైటిల్స్ వేయడం ప్రధానంగా చర్చకొచ్చింది. అంతేకాదు, మా ఫైనిన్షియర్స్ ఉషాకిరణ్ మూవీస్ అంటూ ఇంకో క్రెడిట్ కూడా ఇచ్చారు. భారతదేశంలోనే ఇదో గొప్ప సినిమా .. అందుకే ఈ మీడియా కింగ్ సపోర్ట్ ఇస్తున్నారని అనుకోవడానికి లేదిప్పుడు. ఏదేమైనా ఇది ప్రస్తుతం టాలీవుడ్ సహా అన్నిచోట్లా హాట్ టాపిక్.