Begin typing your search above and press return to search.
రామోజీ సినిమాలు చూస్తారా?
By: Tupaki Desk | 15 Nov 2015 5:30 PM GMTరామోజీ రావు.. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ లో ఒకరు. పత్రికా రంగం - మీడియా - సినిమా - హోటల్స్ - ఫుడ్స్ - చిట్స్ .. ఇలా తాను అడుగుపెట్టిన ప్రతిచోటా తిరుగులేని విజయాలు సాధించిన వ్యక్తి. ఐతే ఆయన్ని ఎక్కువగా పాపులర్ చేసింది మీడియా - సినిమాలే. తెలుగులో రామానాయుడి తర్వాత అత్యధికంగా సినిమాలు నిర్మించింది ఆయనే. ఇప్పటికే ఆయన తీసిన సినిమాల సంఖ్య 90 దాకా ఉంది. త్వరలోనే సెంచరీ కొట్టినా కొట్టేస్తారేమో. మరి అన్ని సినిమాలు తీసిన రామోజీ.. అసలు సినిమాలు చూస్తాడా? చూస్తే ఏవి చూస్తాడు? తాను నిర్మించే సినిమాల పైన అయినా ఓ లుక్కేస్తారా? అన్నది ఆసక్తికరం.
ఐతే సన్నిహితుల సమాచారం ప్రకారం రామోజీ అసలు సినిమాలే చూడరట. తాను నిర్మించే సినిమాలు చూడటం కాదు కదా.. వాటి విశేషాలు కూడా తెలుసుకోవడం కూడా మానేశారట. సినిమాల నిర్మాణానికి రామోజీ ఫిలిం సిటీలో విభాగం ఉంది. అందులో ఉన్న వారే సినిమాను ఫైనలైజ్ చేస్తారు. కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు సినిమా గురించి చెప్పి, బడ్జెట్ గురించి చెబితే.. ఆమోద ముద్ర మాత్రం వేస్తారట ఆయన. తన టైం చాలా వాల్యుబుల్ అని.. సినిమా చూడ్డానికి వెచ్చించలేనని.. కొన్నేళ్ల కిందటే తీర్మానం చేసుకుని సినిమాలు చూడ్డం మానేశారట ఆయన.
ఐతే కొన్ని ప్రత్యేకమైన సినిమాల్ని మాత్రం ఆయన కోసం ఫిలిం సిటీలోని ఇంట్లో ప్రదర్శిస్తుంటారట. అలా ఈ మధ్య ‘బాహుబలి’ చిత్రాన్ని ఆయన కాస్త ఆసక్తిగా చూసినట్లు సమాచారం. అది కూడా పూర్తిగా చూడలేదని, తెలుగు పరిశ్రమకు గర్వకారణమైన సినిమా కావడం.. ఇందులో పరోక్షంగా తమ పెట్టుబడి కూడా ఉండటంతో దాన్ని తిలకించడానికి ఆసక్తి చూపించారట మీడియా మొఘల్. అంతే లెండి.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతూ, ఎన్నో వ్యవహారాల్ని చక్కదిద్దుతూ.. ముఖ్యమంత్రుల్నే తన దగ్గరికి రప్పించుకోగల స్థాయి వ్యక్తికి సినిమాలు చూసే టైం ఎక్కడుంటుంది?