Begin typing your search above and press return to search.

రామోజీ మినీ థియేటర్లు నిజమా?

By:  Tupaki Desk   |   25 May 2015 1:30 PM GMT
రామోజీ మినీ థియేటర్లు నిజమా?
X
ఏపీ, తెలంగాణలో వినోదం హైజాక్‌ అవుతోందా? ప్రస్తుతం ఉన్న థియేటర్‌ సిస్టమ్‌కి ప్యారలల్‌గా కొత్త థియేటర్‌ సిస్టమ్‌ రానుందా? అంటే అవుననే సమాచారం. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ, తెలంగాణలో భారీగా మల్టీప్లెక్సులు (థియేటర్లు, షాపింగ్‌) నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారన్న వార్తలొచ్చాయి.

ఇదే తరుణంలో మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సైతం వినోదరంగంలో వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో 200 నుంచి 300 సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న మినీ థియేటర్లను నిర్మించాలన్నది రామోజీ ప్లాన్‌. ఇప్పటికే ఈ విషయమై టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్ని కలిసి ముచ్చట్లాడారు. అయితే ఈ భారీ ప్రాజెక్టు వెంటనే అమల్లోకి వస్తోందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. రామోజీ నోటి వెంట ఆ మాట ఇంకా అధికారికంగా రాలేదు.

మైండ్‌లో మ్యాప్‌ ఉందన్నది నిజం. పక్కా ప్లాన్‌ చేస్తున్నారన్నది వాస్తవం. అయితే బడ్జెట్‌, టైమ్‌ పీరియడ్‌ వంటి వాటిని నిర్ణయించడానికి పక్కా ప్రణాళిక అవసరం కాబట్టి ఇంకా అధికారిక వార్త రావడం ఆలస్యమవుతోంది. మినీ థియేటర్లతో ఆ నలుగురికి అడ్డుకట్ట వేసినట్టయితే మంచిదేగా. ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.