Begin typing your search above and press return to search.
న్యూప్లాన్: ఏపీలో రామోజీ ఫిలింస్టూడియో
By: Tupaki Desk | 27 Aug 2015 10:45 PM GMTరామోజీ ఫిలింసిటీ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫిలింస్టూడియో. దాదాపు 2500 ఎకరాల్లో ఈ స్టూడియోని మీడియా దిగ్గజం రామోజీరావు నిర్మించారు. హాలీవుడ్, బాలీవుడ్ సహా ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి షూటింగులు చేస్తున్నారు. హైదరాబాద్ కి పర్యాటకం అభివృద్ధి చెందడానికి రామోజీ ఫిలింస్టూడియో ఓ కారణం.
అంత పెద్ద మీడియా దిగ్గజర కొత్త ఎత్తుగడలతో ఇంకా ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం నిత్యం చర్చల్లోకొస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రామోజీ ఆలోచనల్లో మరింత పదును పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 100 నుంచి 200 సీట్ల కెపాసిటీతో మినీ థియేటర్లను నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చారాయన. ద్వితీయ శ్రేణి నగరాల్లో వీటిని నిర్మించేందుకు పంపిణీదారులు, పరిశ్రమ వర్గాలతో ముచ్చటించారు. ప్లాన్ రెడీ అవుతోంది.
ఈలోగానే భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని నూతన రాజధానితో సిద్ధమవుతున్న ఏపీలోనూ ఓ ఫిలింస్టూడియోని నిర్మించేందుకు రామోజీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రామోజీ సంప్రదించారని సమాచారం. ఒకవేళ ప్లాన్ వర్కవుటైతే ఒక మినీ స్టూడియో ఏపీలోనూ రెడీ అవుతుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లను చేస్తారు. అయితే ఇప్పటికే విశాఖ పరిసరాల్లో రామోజీరావు ఓ ఫిలిం స్టూడియో నిర్మాణానికి సైలెంటుగా శ్రీకారం చుట్టారన్న వార్తలూ వెలువడ్డాయి.