Begin typing your search above and press return to search.
రాములో రాముల.. ఆ మెరుపులేమయ్యాయ్?
By: Tupaki Desk | 27 Jan 2023 9:47 AMకొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకూడదని అంటారు. టచ్ చేసినా సరిపోలడం అంత సులువేమీ కాదు. చాలా విమర్శల తర్వాత అందరు విమర్శకుల నోళ్లు మూయించడానికి ఎస్.ఎస్.థమన్ తొలిసారి తన క్రియేటివిటీ అంతా చూపించిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రముని మార్గనిర్ధేశనంలో ప్రతి పాటను చార్ట్ బస్టర్ గా రూపొందించాడు. ఇక ఈ చిత్రంలోని రాములో రాముల.. సాంగ్ ఎంత పెద్ద చార్ట్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. అల చిత్రంలో ప్రతి పాటా దేనికదే వైవిధ్యంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ ఎనర్జిటిక్ స్టెప్పులు.. పూజా హెగ్డే పొడుగు కాళ్ల సొగసుతో బుట్టబొమ్మ ఎలివేషన్ ప్రతి పాటకు కొత్త కళను తెచ్చాయి. వీటన్నిటిలోను 'రాములో రాముల ...' పాట ఒక క్లాసిక్ గా నిలిచింది. అల్లు అర్జున్ - పూజా హెగ్డే రొమాన్స్ సింపుల్ డ్యాన్సులు ఎంతో కళాత్మకం.
ఇప్పుడు ఇదే సినిమాని కార్తీక్ ఆర్యన్- కృతి సనోన్ జంటగా షెహజాదా టైటిల్ తో హిందీ లో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. ఇంచుమించు అల వైకుంఠపురములో వైబ్స్ ని రీక్రియేట్ చేసేందుకు హిందీ పరిశ్రమ ఫిలింమేకర్స్ ప్రయత్నించారని అర్థమైంది. అయితే పాటల వరకూ మాత్రం థమన్ మ్యాజిక్ వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. అక్కడ ప్రీతమ్ సంగీతం ఆకట్టుకుంటున్నా కానీ.. షెహజాదా కి రొటీన్ ట్యూన్ లు వినిపిస్తున్నాడు.
రాములో రాముల పాట స్థానంలో 'చేద్ఖనియన్....' అంటూ సాగే పాటను విడుదల చేయగా ఇది రాములో రాముల రేంజు మ్యాజిక్ ని చేయడంలో విఫలమైంది. రాములో రాములా.. సాంగ్ యూట్యూబ్ తో పాటు థియేటర్లలోను షేక్ చేసిన పాట. థమన్ తొలిసారి ఎంతో గొప్ప సృజనతో ఈ పాటను ఆవిష్కరించారు. అల్లు అర్జున్ డ్యాన్సులు ఎంతో పెప్పీగా స్పెషల్ టింజ్ తో అలరిస్తాయి. హిందీ వెర్షన్ చెద్ఖానియన్ విషయానికి వస్తే అర్జిత్ సింగ్ గానం - ప్రీతమ్ సంగీతం ఓకే అనిపిస్తాయి.
పాట మేకింగ్ బాగుంది కానీ అల్లు అర్జున్ తో కార్తీక్ ఆర్యన్ డ్యాన్సులను పోల్చలేం. అలాగే అల్లు అర్జున్ కి మంచి అభిమానిని అని కార్తీక్ ఆర్యన్ చెబుతుంటారు. అయితే అల వైకుంఠపురములో హీరో పాత్రను యథాతథంగా అనుకరించే ప్రయత్నం చేయలేదు. అతడు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డ్యాన్సులతో మాత్రమే తెరపైకి వచ్చాడు. కేవలం ఆ కథను ఉత్తరాది ఎమోషన్స్ తో మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పూజా హెగ్డేతో పోలిస్తే మరో బుట్టబొమ్మను చూడలేం. అవే కళ్లతో చూస్తే కృతి సనోన్ జస్ట్ యావరేజ్ అనిపిస్తోంది కానీ బుట్ట బొమ్మ వైబ్స్ ని పునఃసృష్టించలేకపోయింది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన షెహజాదా 10 ఫిబ్రవరి 2023న థియేటర్లలోకి రానుంది. ఎనర్జిటిక్ బన్నీ నటించిన తెలుగు ఒరిజినల్ మూవీని చూడని హిందీ అభిమానులు తప్ప మిగిలిన వారు ప్రస్తుతానికి ఈ రీమేక్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.