Begin typing your search above and press return to search.
ఈసారి వైకుంఠపురంలో మ.. మ.. మాస్
By: Tupaki Desk | 20 Oct 2019 11:45 AM GMTమూడు వారాల క్రితం విడుదలైన సామజవరగమన పాట సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. 43 మిలియన్ లను క్రాష్ చేసిన ఆ పాట సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. సోషల్ మీడియాలో ఆ పాట ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం సామజవరగమన అంటూ డబ్ ష్మాష్ లు టిక్ టాక్ వీడియోలు ఎన్నో వచ్చాయి. అంతగా వైరల్ అయిన ఆ పాట తర్వాత 'అల వైకుంఠపురంలో' సినిమా నుండి మరో పాటను విడుదల చేసేందుకు థమన్ సిద్దం అయ్యాడు.
రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు 'రాములో రాముల..' అనే పాట గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. పూర్తి పాటను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారట. పాట గ్లింప్స్ విడుదలకు సంబంధించిన పోస్టర్ లో అల్లు అర్జున్ మందు గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఒక పార్టీ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ పాట మాస్ మసాలా బీట్ తో సాగుతుందనిపిస్తుంది. పల్లవిలోని ఆ పదాలను చూస్తుంటేనే మ.. మ.. మాస్ అనిపిస్తుంది.
సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే థమన్ వరుసగా పాటలను విడుదల చేస్తున్నాడు. సామజవరగమన పాట విడుదలైన నాలుగు వారాలకు రాములో రాముల పాటను విడుదల చేయబోతున్నాడు. దీని తర్వాత మరో రెండు మూడు వారాలకు మరో పాట వస్తుందేమో చూడాలి. సామజవరగమన క్లాస్ టచ్ తో సాగగా రాములో రాముల పాట మాస్ ఆడియన్స్ చిందులేసే విధంగా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల వారు.. ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంను దర్శకుడు త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. బన్నీ కూడా గత చిత్రం నా పేరు సూర్య నుండి బయట పడేందుకు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు పెంచేలా థమన్ చాలా కృషి చేస్తున్నాడు. ఇక దీపావళికి రాబోతున్న రాములో రాముల పాట సినిమాకు మరెంత ప్లస్ అవుతుందో చూడాలి.