Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: ఎట్టకేలకు 'రంగమార్తాండ'ను చూపించారు

By:  Tupaki Desk   |   27 March 2021 6:10 AM GMT
ఫోటో టాక్: ఎట్టకేలకు రంగమార్తాండను చూపించారు
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయినా కూడా కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాను ఆయన దాదాపుగా మూడేళ్ళుగా చిత్రీకరిస్తున్నారు. ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏదో కారణం వల్ల సినిమా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. గుడిలో మెల్ల అన్నట్లుగా ఈ సినిమా నుండి ఎట్టకేలకు ఒక పోస్టర్ రావడంతో సినిమా ఇంకా లైన్ లొనే ఉంది అంటూ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.

ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఈ ఫోటోను యూనిట్ సభ్యులు షేర్ చేశారు. సినిమా లో ప్రకాష్ రాజ్ లుక్ చాలా సింపుల్ గా నాచురల్ గా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రమ్యకృష్ణ తో ఉన్న ప్రకాష్ రాజ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మరో సారి తన నట విశ్వ రూపం ను చూపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ట్రెండింగ్ లోకి వచ్చిన రంగమార్తాండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా క్రియేటివ్ డైరెక్టర్ సినిమా విడుదల తేది విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది లో అయిన ఈ సినిమా ఉంటుందా అనేది కొందరికి అనుమానంను రేకెత్తిస్తోంది.