Begin typing your search above and press return to search.
రాణి శివగామి.. మరో ప్రయత్నమా?
By: Tupaki Desk | 5 Nov 2019 4:36 PM GMTబాహుబలి ఫ్రాంఛైజీ సంచలనాల గురించి తెలిసిందే. తెలుగు సినిమా గమనం మార్చేసిన అసాధారణ ప్రయత్నం ఇది. ఆ తర్వాత పాన్ ఇండియా కేటగిరీలో సినిమాల వెల్లువ మొదలైంది. ఇక బాహుబలి చిత్రంలోని పాపులర్ క్యారెక్టర్ క్వీన్ శివగామికి పూర్తి రూపం ఇదీ అంటూ సినిమా ఏదీ రాలేదు. అందుకే రాణి శివగామి పాత్ర పై ఫోకస్ చేస్తూ ఫిక్షన్ డ్రామాని అందించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది. రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా `రాణి శివగామి`. మధు.ఎం దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడే రచయిత. శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఎలాంటి కథను ఎంచుకున్నారు? అన్నది ఆరా తీస్తే.. 9వ శతాబ్ధంలో రాణికి.. 21వ శతాబ్ధంతో ఉన్న కనెక్షన్ ఏమిటి? అన్నదే సినిమా కథాంశం అని తెలుస్తోంది. హారర్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో రాణి శివగామి పాత్రలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తారట. నీలాంబరి(నరసింహా) తరహాలో మరోసారి అదిరిపోయే పాత్రలో రమ్య మ్యాడమ్ అదరగొట్టారు అంటూ లీకైంది. తెలుగు-తమిళం-కన్నడలో రిలీజ్ కానుంది. రమ్యకృష్ణ- ప్రవీణ్ తేజ్- పాయల్- రవి కాలే-గోలిసోడా కీర్తి మధు- అవినాష్- రోలర్ రఘు, మధుమణి- మిమిక్రీ రితేష్- రంగన్న తదితరులు నటిస్తున్నారు. వీర్ సమర్త్ సినిమాటోగ్రఫీ.. బాల్ రెడ్డి కెమెరా వర్క్ అందిస్తున్నారు.
ఇక బాహుబలి రిలీజ్ తర్వాత శివగామి పాత్రతో ఆర్కా మీడియా సంస్థ ఓ టీవీ సీరియల్ ని నిర్మించింది. అలాగే బాహుబలి పాత్రల టాయ్స్ అమ్మకాలు.. ఆ తర్వాత యానిమేషన్ గేమింగ్ బిజినెస్ గురించి తెలిసిందే. ఇప్పటికీ జపాన్ లాంటి చోట బాహుబలి టాయ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. ఈ చిత్రంలోని పాత్రల్ని ఆధారంగా చేసుకుని సినిమాలు రూపొందించేందుకు ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో రాణి శివగామిపై సినిమా అంటే ఆసక్తి పెంచేదే. అయితే బాహుబలి మానియా ఉన్నప్పుడే ఇలాంటి సినిమా వస్తే బావుండేది. కాస్త ఆలస్యమైనట్టే కనిపిస్తోంది.