Begin typing your search above and press return to search.

శివగామి చెప్పిన కొత్త సత్యం

By:  Tupaki Desk   |   10 May 2017 8:11 AM GMT
శివగామి చెప్పిన కొత్త సత్యం
X
ఇది నా మాట.. నా మాటే శాసనం అంటూ బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ చెప్పిన డైలాగులెవరూ మర్చిపోరు. రాచరికం.. గాంభీర్యం కలగలపిన పాత్రలో ఆమె జీవించిందనే చెప్పాలి. తన మాటకెదురు లేదన్నట్టు రాజమాతగా ధీరోదాత్తంగా కనిపించిన రమ్యకృష్ణ ఇండస్ట్రీ గురించి కూడా కొన్ని కటువైన నిజాలను ధైర్యంగా చెప్పేసింది.

సినిమా ప్రపంచంలో లేడీస్ పైకి రావాలంటే ఎన్నో రకాలైన వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఎప్పటి నుంచో వినిపించే మాటే. అయితే ఇంతకాలం ఇది తెరచాటుగానే ఉన్నా ఇటీవల కాలంలో బాగా డిస్కషన్ పాయింటయింది. తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి సైతం ఓ టీవీ ఛానల్ హెడ్ తనను వేరే అవసరాల నిమిత్తం ప్రైవేటుగా కలుద్దామంటూ ఛీప్ గా బిహేవ్ చేశాడంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. తాజాగా రమ్యకృష్ణ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పవని తేల్చిచెప్పేసింది. ఇది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. అన్నింటా ఉన్నదేనని... మహిళలు పైకి ఎదగాలంటే చాలా విషయాల్లో సర్దుకుపోవడం తప్పదన్నది ఆమె మాట. అయితే ఎలా సర్దుకుపోవాలి... ఎంతవరకు సర్దుకుపోవాలన్నది అవతల వారిష్టం మీద ఆదారపడి ఉంటుందని అంటోంది.

ఇటీవల ఇండస్ట్రీలో బాగా డిస్కషన్ లో ఉన్న పాయింట్ పై ఓపెన్ గా రమ్యకృష్ణ మాట్లాడేసింది. ఇది కామన్ విషయమంటూనే అడ్జస్ట్ అవగలిగిన వారే ముందుకెళతారని చెప్పింది. డొంకతిరుగుడేం లేకుండా డైరెక్ట్ గా రెండు ముక్కల్లో ఇక్కడి పరిస్థిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఎంతైనా శివగామి మాట శాసనం కదా!