Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రాజ‌మాత లో కొత్త మెరుపు

By:  Tupaki Desk   |   10 Jan 2016 7:30 AM GMT
ఫోటో స్టోరి: రాజ‌మాత లో కొత్త మెరుపు
X
బాహుబ‌లి సినిమాతో ర‌మ్య‌కృష్ణ రేంజే మారిపోయింది. రాజ‌మాత శివ‌గామి పాత్ర‌లో మెరుపులు మెరిపించింది ఈ సీనియ‌ర్ న‌టి. అంత‌కుముందు కెరీర్ అంతా ఒకెత్తు అయితే ఆ ఒక్క క్యారెక్ట‌ర్ ఒక ఎత్తు అయ్యింది. త‌న‌కి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై గుర్తింపు తెచ్చిన రోల్ అది. ర‌మ్య‌కృష్ణ బెస్ట్ క్యారెక్ట‌ర్స్ అన్నీ వెతికితే అల్ల‌రిమొగుడు సినిమాలో చేసిన పెర్ఫామెన్స్‌ - న‌ర‌సింహాలో చేసిన పెర్ఫామెన్స్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివి. అంత‌కుమించిన ఐడెంటిటీ శివ‌గామి క్యారెక్ట‌ర్‌ తో ద‌క్కించుకుంది. అందుకేనేమో ఇటీవ‌లి కాలంలో ర‌మ్య పేరు ఇటు ద‌క్షిణాదితో పాటు అటు ఉత్త‌రాదిన కూడా మార్మోగిపోయింది.

అందుకే ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ల దృష్టి ర‌మ్య‌పై ప‌డింది. అంత‌టి ట్యాలెంటెడ్ న‌టిని ఫోక‌స్ చేస్తే త‌ప్పేంలేద‌ని భావించి క‌వ‌ర్‌ గాళ్‌ గా ప్ర‌మోట్ చేస్తున్నాయి. ప్ర‌ఖ్యాత ప్రొవోక్ లైఫ్ స్ట‌యిల్ మ్యాగ‌జైన్‌ క‌వ‌ర్ పేజీపై ర‌మ్య‌కృష్ణ ద‌ర్శ‌న‌మివ్వ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. ఆంటీగారు... కాస్తంత వ‌య‌సు త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తున్నారే. ప‌చ్చంద‌న‌మే ప‌చ్చ‌ద‌న‌మే అన్న‌చందంగా ర‌మ్య క‌నిపించిన తీరు ఇంట్రెస్టింగ్‌. ఓ ట్రెడిష‌న‌ల్ డిజైన‌ర్ వేర్‌ లో ఎంతో రాయ‌ల్‌ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం బాహుబ‌లి -2 ఆన్‌ సెట్స్ ఉంది. ఈ సినిమా లో ర‌మ్య క్యారెక్ట‌ర్‌పైనా ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ సాగుతున్న టైమ్‌ లో ఈ కొత్త స్ట‌యిల్‌ తో అప్పీయ‌రెన్స్ ఇచ్చిందిలా. ఇదిగో ఆ పిక్ మీకోసం....