Begin typing your search above and press return to search.
అవి బోర్ కొట్టాయి కొత్తగా ట్రై చేస్తా
By: Tupaki Desk | 28 May 2020 5:15 AM GMT1990లలో తెలుగు.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా నటిస్తున్న రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీరు తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఎక్కడ ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా అందుకు ఆమె నాకు తెలుగు అయినా తమిళం అయినా రెండు సమానమే అంటూ పేర్కొంది.
ఇంకా రమ్యకృష్ణ మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా అమ్మగా అత్తగా నటించి బోర్ కొట్టింది. ఎప్పుడు చేసిన పాత్రలే చేస్తుండటంతో కెరీర్ లో కొత్తదనం లేకుండా పోయింది. అందుకే అమ్మగా అత్తగా కాకుండా కొత్తగా నటించేందుకు ప్రయత్నిస్తున్నాను. అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. ఏదైనా డిఫరెంట్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు.. కథలకు ఓకే చెప్తానంటూ చెప్పుకొచ్చింది.
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు మరియు తమిళంలోనే కాకుండా ఉత్తరాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం బిజీ నటిగా ఉంది. ఈమె చేతిలో అర డజనుకు పైగా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇదే సమయంలో జయలలిత జీవిత చరిత్రతో వచ్చిన వెబ్ సిరీస్ కు ప్రస్తుతం సీక్వెల్ చేసే పనిలో ఉంది. జయలలిత పాత్రతో రమ్యకృష్ణ సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.