Begin typing your search above and press return to search.
శివగామి క్యాప్షన్.. మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీయే
By: Tupaki Desk | 23 Feb 2021 4:45 AM GMTరౌడీ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి-ఛార్మి-కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం-హిందీ సహా పలు సౌత్ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
దాదాపు 9నెలల గ్యాప్ తర్వాత లైగర్ చిత్రీకరణ ఇటీవల ముంబైలో తిరిగి ప్రారంభమైంది. ఆన్ లొకేషన్ చిత్రబృందం షెడ్యూళ్లతో కుస్తీలు పడుతున్నా .. మరోవైపు బాలీవుడ్ తరహా పార్టీ కల్చర్ తో చెలరేగుతోంది. అక్కడ ఫుల్ గా నైట్ పార్టీలతో చిలౌట్ చేస్తూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పూరి బృందం హీట్ పెంచేస్తున్నారు.
ఇంతకుముందు అనన్య పాండే-కియరా- సారా అలీఖాన్ తో రౌడీ ఫుల్ గా పార్టీ చేసుకోగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వెటరన్ నటి శివగామితో కలిసి రౌడీ షూటింగులో పాల్గొంటున్నాడు. ఆ క్రమంలోనే ఈ ఫోటోని రమ్యకృష్ణ తన ఇన్ స్టాలో షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే ఉంటుంది! అంటూ ఆన్ లొకేషన్ సరదా వాతావరణం ఎలా ఉందో వర్ణించారు. ఈ చిత్రంలో దేవరకొండకు మదర్ పాత్రలో నటిస్తున్నారు రమ్య.
లైగర్ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. `సాలా క్రాస్ బ్రీడ్` అనే ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఇది మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ కేటగిరీలో తెరకెక్కుతోంది.