Begin typing your search above and press return to search.

రమ్యకృష్ణ కావాలనే చేసిందా.. కవరింగ్‌ చేసిందా?

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:05 PM GMT
రమ్యకృష్ణ కావాలనే చేసిందా.. కవరింగ్‌ చేసిందా?
X
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ పుట్టిన రోజు నిన్న. ఆ సందర్బంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాది మంది అభిమానులు మరియు వందలాది మంది సెలబ్రెటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు కూడా పూరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రమ్యకృష్ణ నిన్న బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పడం మర్చి పోయిందో లేదంటే ప్రత్యేకంగా ఉండాలని భావించిందో కాని నేడు అంటే ఒక్క రోజు ఆలస్యంగా పూరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

ఒక్క రోజు ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన రమ్యకృష్ణ కాస్త తెలివిగా తాను కావాలనే ఈ రోజు చేసినట్లుగా ట్వీట్‌ చేసింది. నీ బర్త్‌ డే ను నేను మర్చిపోలేదు. ఒకే రోజు అందరి శుభాకాంక్షలు వస్తే ఎలా అందుకే నేను విభిన్నంగా ఉండాలని ఈ రోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. నాకు తెలిసిన దర్శకుల్లో మంచి వారు నిజాయితీ పరులు మీరు అంటూ పూరి పై రమ్యకృష్ణ ట్వీట్‌ చేసింది. రమ్యకృష్ణ కావాలని ఆలస్యంగా బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పిందా లేదంటే ఆలస్యం అయ్యిందని కవర్‌ చేసిందా అంటూ నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.