Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తరువాత వీళ్ళతో అత్తావతారం

By:  Tupaki Desk   |   22 March 2018 10:30 AM GMT
ఎన్టీఆర్ తరువాత వీళ్ళతో అత్తావతారం
X
ఎలాంటి సపోర్టింగ్ రోల్ అయినా ఆమెకు ఆమే సాటి అని నిరూపించుకుంది రమ్య కృష్ణ. బాహుబలి లో శివగామిలా ఆమె రాజసం, ఆమె యాక్టింగ్ కి ఫిదా అవ్వని వారుండరు. బాహుబలి సినిమా తర్వాత ఈమెకు కూడా ఆఫర్లు పెరిగిపోయాయి. సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండే పాత్రలని రమ్య కృష్ణ ఎంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఆమె నాగ చైతన్యతో 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు. ఆమెది చైతు అత్త పాత్ర. టైటిల్ చూస్తేనే అర్థమైపోతోంది ఆమె అత్త పాత్రకు సినిమాలో ఎంత వాల్యూ ఉంటుందో అని. అలానే మరొక హీరోకు అత్త గా చేయడానికి ఒప్పుకున్నారు అని సమాచారం. పరుగు సినిమాతో కమెడియన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సప్తగిరి చాలా సినిమాలలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పాపులారిటీ సంపాదించి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరో అయిపోయాడు. తర్వాత సప్తగిరి ఎల్ ఎల్ బి లో నటించినా ఇంకా ఒక్క హిట్ కూడా నమోదు చేసుకోలేదు. ఇప్పుడు సప్తగిరి హీరోగా చేస్తున్న మూడవ సినిమాలో రమ్య కృష్ణ అతని అత్తగా కనిపించబోతున్నారు.

అల్లరి నరేష్ తో సెల్ఫీ రాజా సినిమా తీసిన ఈశ్వర్ రెడ్డి ఇప్పుడు సప్తగిరి హీరోగా ఒక సినిమా చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ కథ కూడా అత్త, అల్లుళ్ల మధ్య సాగే సినిమాలా కనిపిస్తోంది. ఇంకా హీరోయిన్ ఎవరో తెలియదు. ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ కి అత్తగా 'నా అల్లుడు' సినిమాలో నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు నాగ చైతన్యకి, -సప్తగిరి అత్త అవతారం ఎత్తబోతున్నారు.