Begin typing your search above and press return to search.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ నీలాంబరి అక్కడంత డేర్ చేయలేదేం?
By: Tupaki Desk | 28 Aug 2022 3:55 PM GMTవెటరన్ నటి రమ్యకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు..తమిళ్..కన్నడ..మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. మూడు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. నీలాంబరి సెకెండ్ ఇన్నింగ్స్ సైతం ఎంతో వైభవగా సాగిపోతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ విజయ దుందుబీ మోగిస్తున్నారు.
రమ్యకృష్ణ సమకాలీకుల్లో ఈమె ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనది. అయితే దక్షిణాది భాషల్లో రాణించింనంతగా బాలీవుడ్ లో ఫేమస్ కాలేకపోయారు. కేవలం కొన్ని సినిమాలతోనే అక్కడ మెప్పించగలిగారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ హిందీలో `లైగర్` సినిమాతో మెప్పించే ప్రయత్నం చేసారు. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
ఈ సందర్భంగా రమ్యకృష్ణ వద్ద హిందీ సినిమాల ప్రస్తావన తీసుకురాగా? ఆ సక్తికర వ్యాఖ్యలు చేసారు. `ఎక్కడైనా ఎక్కువ సినిమాలు చేయాంటే బలమైన విజయం ఉండాలి. హిందీలో ఇంతవరకూ చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. అయితే హిందీలో అవకాశాలు వచ్చే సమయానికి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నా. అందుకే టాలీవుడ్ ని విడచిపెట్టి బాలీవుడ్ లో పోరాటం చేయలేదు` అన్నారు.
దీన్ని బట్టి రమ్యకృష్ణ కంపర్ట్ జోన్ లో నే ఉండాలని చూసుకున్నారు. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదిగా భావించి రిస్క్ లు తీసుకోలేదు. కానీ ఇది పూరి జగన్నాధ్ కి నచ్చే యాటిట్యూడ్ కాదు. ఏదైనా పీక్స్ లో ఉండగా దాన్ని విడిచిపెట్టి కొత్త వాటివైపు చూడటం అంటే ఇష్టం. ఆ రకంగా నీలాంబరి పూరి ఆలోచనలకి భిన్నమని చెప్పొచ్చు.
రమ్యకృష్ణ 1988 లో బాలీవుడ్ లో వినోద్ ఖన్నా హీరోగా నటించిన `దయావాన్` చిత్రంలో ఐటం పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటిగా `ఖల్ నాయక్` లో అవకాశం అందుకున్నారు. అటుపై `పరంపర`..`క్రిమినల్`..`చాహాట్`..`బెనారాస్ బాబు`..`లోహ`..`షాపత్`..`వజూద్`..`బడే మియాన్..చోటా మియాన్` చిత్రాల్లో నటించారు.
ఆ తర్వాత 24 ఏళ్ల గ్యాప్ అనంతరం `లైగర్` తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ అంచనాలు తారుమారు అవ్వడంతో మరోసారి నీలాంబరి లెక్కలు తప్పాయి. ప్రస్తుతం దక్షిణాదిన వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. నటిగా ఆమెకెప్పుడు సౌత్ లో తిరుగులేదు. తనదైన బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. `నరసింహ`లో నీలాంబరి పాత్రతో ఆమెకు సౌత్ లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.