Begin typing your search above and press return to search.

ఆమె మ‌రో రాణి అంటూ ఆకాశానికెత్తేసిన వెట‌ర‌న్!

By:  Tupaki Desk   |   14 Jun 2020 4:35 AM GMT
ఆమె మ‌రో రాణి అంటూ ఆకాశానికెత్తేసిన వెట‌ర‌న్!
X
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని బహుముఖ నటీమ‌ణుల్లో రమ్య కృష్ణ(న్) ఒకరు. ఈ వెట‌ర‌న్ న‌టి పాత్రలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ప్ర‌తిసారీ ఏదో ఒక విల‌క్ష‌ణ‌త‌.. పాత్ర‌లో ఛాలెంజ్ మైమ‌రిపిస్తుంది. అమ్మోరు (అమ్మాన్) చిత్రంలో అమ్మోరు దేవతగా న‌టించి సంచ‌ల‌న‌మే అయ్యారు ఆరోజుల్లో. న‌ర‌సింహా (పాదయప్ప)లో కోల్డ్ హార్ట్ విరోధిగా ర‌జ‌నీకాంత్ తో పోటీప‌డుతూ విలనీ పండించి మెప్పించారు. బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి (రాజ‌మాత) పాత్ర‌లో అద్భుతంగా న‌టించి చ‌రిత్ర‌లో నిలిచారు. కెరీర్ లో ఇలాంటి విల‌క్ష‌ణ పాత్ర‌లెన్నో పోషించిన వెట‌ర‌న్ న‌టిగా ఇండ‌స్ట్రీ నుంచి గౌర‌వం అందుకున్నారు. అంత‌టి గ్రేట్ స్టార్.. బాలీవుడ్ రెబ‌ల్ క్వీన్‌ కంగనా రనౌత్ పై చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

క్వీన్ కంగ‌న‌ ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న `త‌లైవి`లో న‌టిస్తున్న సంగ‌తి విధిత‌మే. ఓ ఇంట‌ర్వ్యూలో కంగ‌న ఊహించ‌ని వ్యాఖ్య‌ను చేశారు. `బాహుబలి`లో రమ్య కృష్ణన్ పాత్ర గొప్పత‌నం గురించి మాట్లాడారు. ర‌మ్య‌కృష్ణ న‌ట ప్ర‌తిభ‌ను కొనియాడారు. ఇప్పుడు రమ్య కృష్ణ అందుకు బ‌దులిచ్చేశారు. కంగనాపై తన ఆలోచనలను ఓ మీడియాతో పంచుకున్నారు. కంగ‌న‌ గురించి రమ్య మాట్లాడుతూ, ``కంగన ఎంతో ధైర్యవంతురాలు.. అద్భుతమైన సెల్ఫ్ మేడ్ (స్వీయ-నిర్మిత) మహిళ. నేను నిజానికి త‌న‌ని ఎంత‌గానో ఆరాధిస్తాను. ఆమె మరో రాణి`` అంటూ ఆకాశానికెత్తేశారు.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఓ ఆస‌క్తిక‌ర సారూప్య‌త ఉంది. ఆ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత జీవిత‌క‌థ‌లో న‌టిస్తున్నారు. టైటిల్ పాత్రను తిరిగి తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. రమ్య కృష్ణన్ వెబ్ సిరీస్ `క్వీన్` ‌లో దివంగత నాయకురాలు జ‌య‌ల‌లిత‌ పాత్రను పోషిస్తుండగా.. కంగనా వెండితెర కోసం ఆ పాత్ర‌లో న‌టిస్తోంది. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మూడు టీజర్లు ఈ ఏడాది ప్రారంభంలో విడుదలయ్యాయి. అరవింద్ స్వామి ఈ చిత్రంలో దివంగత ఎఐఎడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్‌ గా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగులో నాయ‌కి గా.. హిందీలో `జయ` టైటిల్ తో విడుదల కానుంది. మరోవైపు రమ్య కృష్ణ `క్వీన్` వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో న‌టిస్తున్నారు. ఈ ధారావాహికకు ఏస్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.