Begin typing your search above and press return to search.

న్యాయం కోరితే పక్కన పెట్టేస్తున్నారు!

By:  Tupaki Desk   |   12 Nov 2018 10:44 AM GMT
న్యాయం కోరితే పక్కన పెట్టేస్తున్నారు!
X
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రెటీలు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెప్పుకొస్తున్న విషయం తెల్సిందే. లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న వారిని పక్కకు పెడుతున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ రమ్యా నంబీశన్‌ మీడియా ముందుకు వచ్చి మీటూ ఉద్యమం గురించి స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదని ఆమె పేర్కొంది.

రమ్యా నంబీశన్‌.. మీటూ ఉద్యమం ప్రస్తుతం ఒక అలా దూసుకు వస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మళాయాల సినిమా పరిశ్రమలో గతంలో ఒకసారి లైంగిక వేదింపులకు గురైన వారు ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ డబ్ల్యూ సీ సీ పేరుతో ఒక సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘంలో ఎంతో మంది మహిళలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ సంఘంలో ఎవరైతే ఫిర్యాదు చేసేవారో వారిని ఇండస్ట్రీ వారు పక్కకు పెట్టే వారు. దాంతో కొన్నాళ్లకు అందులో ఫిర్యాదు చేయడం మానేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మీటూ ఉద్యమం నేపథ్యంలో అలా జరగవద్దని కోరింది. లైంగిక ఆరోపణలు చేసిన వారిని ఇండస్ట్రీ నుండి పక్కన పెట్టడం వల్ల మళ్లీ మహిళలపై వేదింపు పెరుగుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్‌ ఆరోపణలు చేశారు. వారిలో కొందరికి ఛాన్స్‌ లు వస్తున్నా ఎక్కువ శాతం మందికి మాత్రం ఆఫర్ల్‌ రావడం కష్టంగా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.