Begin typing your search above and press return to search.
నరేష్ - పవిత్రల పెళ్లి జరగనిచ్చేది లేదు
By: Tupaki Desk | 6 Jan 2023 2:06 PM GMTటాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ త్వరలో నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. గత కొంత కాలంగా ఈయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఆ విషయాన్ని గతంలోనే ఒకటి రెండు సార్లు దృవీకరించారు. తాజాగా తాము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక వీడియోను విడుదల చేసి.. అందులో ఇద్దరు ముద్దు పెట్టుకుని మరీ క్లారిటీ ఇచ్చారు.
నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో విడాకులు అయిన తర్వాతే పవిత్ర తో పెళ్లిని నరేష్ ప్రకటించి ఉంటాడు అంటూ అంతా అనుకున్నారు. కానీ తాజాగా రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి ఇంకా తమ విడాకులు కాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదు అంటూ ఆమె ప్రకటించింది.
తన 11 ఏళ్ల కొడుకు నరేష్ తో నేను కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాడు. నా కొడుకుకు ఇచ్చిన మాట ప్రకారం నేను నరేష్ తో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఆయనకు విడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదు. ప్రస్తుతానికి విడాకుల విషయం కోర్టు లో ఉంది. ఈలోపే నరేష్ విడుదల చేసిన వీడియో.. చేసిన ప్రకటన బాధ కలిగించింది అంటూ రమ్య పేర్కొంది.
ఇప్పటికే విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి అంటూ నరేష్ కాంపౌండ్ నుండి ప్రచారం జరుగుతోంది. విడాకులు దాదాపుగా వచ్చినట్లే అని.. అందుకే నరేష్ పెళ్లి ప్రకటన చేశాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. రమ్య మరేదో కారణం వల్ల ఇలా మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తుంది అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్లి జరగనిచ్చేది లేదు అంటూ రమ్య రఘుపతి చాలా బలంగా వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు మాత్రం ఇప్పటికే సహజీవనం సాగిస్తున్నారు. అధికారికంగా విడాకులు మంజూరు అయిన తర్వాత పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.