Begin typing your search above and press return to search.

మళ్లీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మల్లి

By:  Tupaki Desk   |   6 March 2016 1:30 PM GMT
మళ్లీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మల్లి
X
టాలీవుడ్ తో పాటు దాదాపు సౌత్ లోని అన్ని భాషల్లోనూ వ్యాంప్ టైపు కేరక్టర్లతో బాగానే మెప్పించింది రమ్యశ్రీ. సహజంగా సినిమాలు తగ్గిపోయే టైంలో వేరే రూట్ వైపు మళ్లుతూ ఉంటారు యాక్టర్లు. కానీ రమ్యశ్రీ మాత్రం.. మంచి జోష్ లో ఉన్న టైంలో తనే దర్శకురాలిగా ఓ సినిమా స్టార్ట్ చేసేసింది. ఈ మూవీ నిర్మాత కూడా ఆమె సోదరుడే. అంటే తనే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'.

ఓ మల్లి మూవీని రమ్యశ్రీ స్టార్ట్ చేసి మూడేళ్లకు పైగానే అయింది. మొదట్లో స్పీడ్ గానే షూటింగ్ చేసింది. ఓ గిరిజన జంట అనుబంధం మధ్య తిరిగే స్టోరీనే ఈ మూవీ కాన్సెప్ట్. పక్షవాతం వచ్చిన మొగుడికి సేవలు చేస్తూ ఉండే రోల్ రమ్యశ్రీది. ఇందులో ఆకాష్ కూడా కీలకమైన రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రమ్యశ్రీ దాదాపుగా జాకెట్ లేకుండానే చేసేసింది. ఆ పోస్టర్ లతోనే మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే.. ఈ గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉన్నా.. అంతకంటే ఎక్కువగా ముూవీలో కంటెంట్ ఉంటుందన్నది దర్శకురాలు రమ్యశ్రీ వాదన.

14 ఏళ్లపాటు ఈ స్టోరీని డెవలప్ చేసిన తర్వాత, వేరే డైరెక్టర్ అయితే కాన్సెప్ట్ చెడగొడతారనే తనే తీసేసిందట రమ్యశ్రీ. ఎన్నెన్నో డేట్స్ తర్వాత.. చివరకు ఈ నెల 18న 'ఓ మల్లి'ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత ప్రశాంత్. గతంలో ఇలాగే ఓ నాలుగైదు సార్లు తేదీని ప్రకటించి బ్యాకౌట్‌ అయిపోయారు. ఈసారైని చెప్పినట్లే రిలీజ్‌ చేస్తారా??