Begin typing your search above and press return to search.
కష్టపడినా.. ఓ మల్లికి సినిమా కష్టాలు
By: Tupaki Desk | 7 April 2015 9:30 AM GMTవ్యాంపు పాత్రలతో తెలుగు తెరకు సుపరిచితమైన నటి రమ్యశ్రీ. డ్యాన్సర్‌గానూ ఈ భామకు పేరుంది. ఇటీవలి కాలంలో నటిగా అవకాశాలు తగ్గాయి. పైగా దర్శకత్వంపై మక్కువతో స్వయంగా ఓ సినిమాని తెరకెక్కించింది ఈ భామ. అడవుల్లో గిరిజనుల జీవన విధానంపై సినిమా ఇది. ఓ మల్లి అనేది టైటిల్. చిత్రీకరణ పూర్తయి ఇప్పటికే ఏడాదిన్నర పైగానే అయ్యింది. మధ్యలో ప్రమోషన్ కూడా చేశారు. అయితే రిలీజ్ ఎప్పుడు? అనేదే ప్రశ్నార్థకం.
రమ్యశ్రీ దర్శకత్వం వహిస్తోంది అనగానేే పరిశ్రమ అంతా అవాక్కయ్యింది. డా.డి.రామానాయుడు అంతటి లెజెండ్ ఇదో గొప్ప ప్రయత్నం.. అంటూ పొగిడేశారు. సినిమా పూర్తయ్యాక ప్రమోషన్ వీడియోలు, పోస్టర్లు చూసినవాల్లంతా ఈ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించింది అని పొగిడినవాళ్లెందరో. కానీ ఏం లాభం? రిలీజ్ పెద్ద సమస్యగా మారింది. వాస్తవానికి రమ్యశ్రీ ఈ సినిమా తీయడానికి కారణం తన చిన్ననాటి సంఘటనలే. స్కూలుకెళ్లే వయసులో ఓసారి ఎక్స్‌కర్షన్‌కి ఓ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ గిరిజనుల జీవినవిధానం, అసౌకర్యాలు, బైటి ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లో వాళ్లు పడుతున్న అవస్థలు చూసి బాధపడింది. అందుకే ఇప్పుడు ఆ సినిమాని తెరకెక్కించింది.
అయితే ఈ కథని కె.బాలచందర్ దర్శకత్వం వహిస్తే బావుంటుందని భావించిన రమ్యశ్రీ అతడికి కథ వినిపించింది. కథ వినగానే ఇంత అద్భుతంగా నేరేట్ చేశావ్ .. నువ్వే దర్శకత్వం వహించవచ్చు కదా! అని అన్నారట. తనకి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కుదరదని అన్నారు. దాంతో రమ్యశ్రీ స్వయంగా రంగంలోకి దిగారు. సినిమా పూర్తయింది. కానీ ఏం లాభం? ఓ మల్లికి అన్నీ కష్టాలే. రిలీజ్ కష్టాలు ఇప్పట్లో తీరేట్టులేవు.