Begin typing your search above and press return to search.
రానా మాట: అజిత్ లుక్ ఒరిజనలా అనడిగా
By: Tupaki Desk | 15 Feb 2017 4:58 AM GMTఈ మధ్య తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమా ‘వివేగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి తమిళనాట పెద్ద రచ్చే జరిగింది. ఈ పోస్టర్ ఒరిజినల్ కాదంటూ యాంటీ ఫ్యాన్స్ నానా యాగీ చేశారు. వేరే ఎవరి బాడీకో అజిత్ తలను అతికించేశారని ఆరోపించారు. ఐతే అజిత్ అభిమానులు మాత్రం ఇది కేవలం దుష్ప్రచారమే అన్నారు. నిజానికి ఈ పోస్టర్ కొంచెం తేడాగానే ఉండటంతో మామూలు జనాలకు కూడా కొంచెం సందేహాలు రేకెత్తాయి. చివరికి మన హీరో రానా దగ్గుబాటికి కూడా అజిత్ లుక్ విషయంలో అనుమానాలు కలిగాయట. ఇది ఒరిజినల్ లుక్కేనా అంటూ స్వయంగా అజిత్ కు ఫోన్ చేసి మరీ అడిగేశాడట రానా.
‘‘నేను ముంబయిలో షూటింగులో ఉండగా ‘వివేగం’ ఫస్ట్ లుక్ రిలీజైంది. అది చూసి ఎగ్జైట్ అయిపోయి వెంటనే అజిత్ సార్ కు ఫోన్ చేశా. ఇది నిజం లుక్కేనా అని అడిగా. ‘ఎస్ చీఫ్’ అని ఆయన బదులిచ్చాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా గర్వంగా కూడా ఫీలయ్యాను. నేను అజిత్ సార్ తో ‘ఆరంభం’ సినిమా చేశాను. కలిసి చాలాసార్లు జిమ్ చేశాం. ఐతే ఆయన ఒంట్లో ఎన్ని గాయాలున్నాయో నాకు తెలుసు. ఆయన శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా తెలుసు. అయినా కూడా అలా బాడీని బిల్డ్ చేయగలిగాడంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం’’ అని ‘ఘాజీ’ ప్రమోషన్లలో భాగంగా చెన్నై మీడియాతో మాట్లాడుతూ రానా అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/