Begin typing your search above and press return to search.
హీరో కాకముందే 75 సినిమాలకు చేశా
By: Tupaki Desk | 5 Feb 2017 9:33 AM GMTదగ్గుబాటి రానా.. తాప్సీ నటించిన ఘాజీ మూవీ.. ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రూపొందిన ఈ మూవీ.. సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తొలి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఘాజీ చిత్రానికి హిందీలో అమితాబ్.. తెలుగులో చిరంజీవి.. తమిళ్ లో సూర్య వాయిస్ ఓవర్ చెప్పడం చెప్పలేని అనుభూతి అంటున్న రానా.. వీరి వాయిస్ తో సినిమాకి మరింత హైప్ వచ్చిందని అంటున్నాడు. 'నాగ చైతన్య.. నేను కలిసి సినిమాల నిర్మాణం చేయబోతున్నాం. చైతు హీరోగా త్వరలో ఓ సినిమా మొదలుపెట్టే అవకాశాలున్నాయి' అన్న రానా.. 'దగ్గుబాటి మల్టీ స్టారర్ చేయాలన్నది తాతగారు రామానాయుడు చివరికోరిక. ఆ ప్రయత్నాల్లో ఉన్నపుడే ఆయన మరణించారు. తప్పనిసరిగా ఆయన కోరిక నెరవేరుస్తా' అంటున్నాడు.
'ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం ఇష్టం లేకనే విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాను. బాహుబలి.. ఘాజీ.. తేజతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మూవీ చేస్తున్నాను.. మరో రెండు ప్రాజెక్టులు త్వరలో అనౌన్స్ చేస్తాను. నాకు ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టం. అలాంటివాటికే ప్రాముఖ్యత ఇస్తా' అన్న రానా.. తనను ఇంట్లో వారితోపాటు సన్నిహితులు 'ఆర్డీ' అని పిలుస్తారని.. ఈ విషయంలో చాలామందికి తెలియదని అన్నాడు.
'నేను హీరో కాకపోయినా ఇండస్ట్రీలోనే ఉండేవాడిని. హీరో కాకముందే.. 75 సినిమాలకు పలు విభాగాల్లో పని చేశాను. వెంకటేష్ మూవీ లక్ష్మీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశా' అన్న రానా.. తన పెళ్లిపై కూడా పెదవి విప్పాడు. చైతు-సమంతల ఎంగేజ్మెంట్ నుంచి.. తనపై పెళ్లి విషయంలో ఒత్తిడి ఎక్కువైందన్న రానా.. కొన్నాళ్లైనా హ్యాపీగా ఉండనివ్వచ్చుగా అంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అన్నాడు దగ్గుబాటి హీరో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/