Begin typing your search above and press return to search.
`రుద్రమదేవి`లోనూ పచ్చబొట్టు తరహా పాట?!
By: Tupaki Desk | 30 July 2015 12:03 PM GMTపచ్చబొట్టేసిన పిల్లగాడా నువ్వు... అంటూ సాగే పాట `బాహుబలి` సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ పాటని రాజమౌళి చిత్రీకరించిన తీరును చూసి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని గుర్తుకు తెచ్చుకొన్నారు తెలుగు సినిమా అభిమానులు. కేవలం ఆ ఒక్క పాటతోనే `బాహుబలి`లో గ్లామర్ అనే పార్ట్ ని ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి. కుర్రకారు మళ్లీ మళ్లీ చూసేలా చేయడంలో పచ్చబొట్టు పాట కీలకంగా పనిచేసిందని చెప్పొచ్చు.
మనోహరా... అంటూ ఓ ప్రత్యేకగీతాన్ని తెరకెక్కించినా, అందులో ముగ్గురు అందాల భామలు కనిపించినా దాంతో పోలిస్తే `పచ్చబొట్టు...` పాటే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే తరహా ఓ రొమాంటిక్ గీతం `రుద్రమదేవి`లోనూ ఉందట. అది కూడా చాలా కలర్ ఫుల్ గా ఉండబోతోందని సమాచారం. రానా, అనుష్కలపై తెరకెక్కించిన ఆ పాటకి సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికొచ్చాయి. ఆ స్టిల్స్ లో అనుష్క అందాలు రాశిపోసినట్టుగా ఉన్నాయి.
రానాని ఓ రొమాంటిక్ హీరోగా చూపించబోతున్నామని గుణశేఖర్ ఇదివరకు జరిగిన ఓ ప్రెస్ మీట్లో చెప్పాడు. `రుద్రమదేవి`లో అనుష్కకి భర్తగా నిడదవోలు యువరాజు చాళుక్య వీరభద్రుడి పాత్రని రానా పోషించాడు. వారిద్దరి మధ్య ప్రేమ, పరిణయం నేపథ్యంలో ఓ మంచి రొమాంటిక్ గీతాన్ని పెట్టారట. ఆ పాటని కూడా చాలా కాస్ట్లీ హంగులతో తెరకెక్కించారని తెలిసింది. రుద్రమదేవిగా కనించనున్న అనుష్కని ఆ పాత్రలో మరీ గ్లామరస్ గా చూపించడం కూడా భావ్యం కాదు. అందుకని హద్దుల్లోనే చూపిస్తూ ఓ మంచి రొమాంటిక్ ఫీల్ కలిగేలా పాటని తెరకెక్కించారట. అనుష్క `బాహుబలి`లో డీగ్లామర్ గానే కనిపించింది. `రుద్రమదేవి`లో మాత్రం అందాల రాశిగా సందడి చేయబోతోంది. గుణశేఖర్ కి అదొక ప్లస్ పాయింట్ గా మారబోతోంది. `రుద్రమదేవి` సినిమాని సెప్టెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.