Begin typing your search above and press return to search.

చందమామను రాధ అంటున్నాడే!!

By:  Tupaki Desk   |   5 Jun 2017 4:46 PM GMT
చందమామను రాధ అంటున్నాడే!!
X
బాహుబలి2తో భారీ సక్సెస్ అందుకున్న రానా.. కొత్త సినిమా రెడీ చేసేస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం తేజ దర్శకత్వంలో రూపొందుతుండగా.. అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి మూవీ టీజర్ ను జూన్ 6న విడుదల చేస్తానని ఇప్పటికే చెప్పిన దగ్గుబాటి రానా.. అనుక్షణం ఆసక్తి పెంచేస్తున్నాడు. సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్స్ పెడుతూ పబ్లిసిటీ హంగామాతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో లుక్ ను రిలీజ్ చేశాడు రానా. నేవీ బ్లూ కరల్ సఫారీ సూట్ లో రానా లుక్ కొత్తగా కనిపిస్తోంది. హెయిర్ స్టైల్ తో పాటు.. గడ్డం కూడా డిఫరెంట్ గా చేయించాడు రానా. ఇక పక్కనే ఉన్న చీర కట్టిన చందమామ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. అచ్చమైన తెలుగింటి ఆడపడుచు మాదిరిగా కాజల్ తెగ మెరిపించి మురిపిస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో తను జోగేంద్రగా కనిపించనున్నట్లు ఇప్పటికే చెప్పిన రానా.. ఇప్పుడు హీరో భార్య పాత్ర పోషిస్తున్న కాజల్ పేరు రాధ అంటూ చెప్పేశాడు. రాధాజోగేంద్ర అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఈ లుక్ ను అందించాడు రానా. రానా- కాజల్ అగర్వాల్ పెయిర్ మాత్రం సూపర్బ్ గా ఉందని చెప్పాలి. తన అరంగేట్ర చిత్రం లక్ష్మీ కళ్యాణం తర్వాత మళ్లీ పదేళ్లకు తేజ దర్శకత్వంలో సినిమా చేస్తోంది టాలీవుడ్ చందమామ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/