Begin typing your search above and press return to search.

ఒకరి కౌగిలిలో ఒకరుగా.. టాలీవుడ్ కొత్త జంట!!

By:  Tupaki Desk   |   29 Jan 2021 12:41 PM GMT
ఒకరి కౌగిలిలో ఒకరుగా.. టాలీవుడ్ కొత్త జంట!!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా పెళ్ళైన జంటలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య పెళ్లి చేసుకున్న జంటలన్నీ దాదాపుగా ప్రేమపెళ్లితో ఒక్కటయ్యాయి. అందులో ఒక బ్యూటిఫుల్ జంట దగ్గుబాటి రానా - మిహీక జంట. వీరి ప్రేమ విషయం బయట పెట్టినప్పటి నుండి రానా మిహికల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక పెళ్లి జరిగిన తర్వాత నుండి రానా మిహికలు కూడా తరచూ ఏదొక పోస్ట్ తో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ జనరేషన్ లో 'వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్'గా పాపులర్ అయ్యారు ఈ కపుల్. అయితే రానా సినిమాలతో రెగ్యులర్ గా కనిపించినప్పటికి అతని భార్య మిహీక మాత్రం అరుదుగా కనిపిస్తుంది. తాజాగా ఈ కపుల్ మరోసారి కెమెరా ముందు ప్రత్యక్షమయ్యారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి హ్యాండ్ ఇంప్రెషన్ గోల్డెన్ 3డి స్ట్రక్చర్ ఒకటి తయారు చేయించుకున్నారు.

తాజాగా ఇద్దరూ కలిసి స్టైల్ గా స్మైల్ ఇచ్చిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో రానా మిహిక ఇద్దరూ కూడా నైట్ లైట్స్ మధ్య బ్లాక్ డ్రెస్సెస్ లో ఫోటోకు పోజిచ్చారు. ఇక రానా బ్లాక్ జాకెట్ ప్యాంటు ధరించగా.. మిహిక స్టైలిష్ బ్లూ మినీ డ్రెస్ లో భర్తను కౌగిలించుకొని ఉంది. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలిలో బంధీలుగా నిలబడ్డారు. అందంగా నవ్వుతూ ఒకరి పై ఒకరు తమ ప్రేమను వెలిబుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ జంట దగ్గుబాటి అభిమానులకు మోస్ట్ ఫేవరేట్ అనే సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉండగా ఎవరి పనులలో వారు ఫుల్ బిజీ అని అర్ధమవుతుంది. ప్రస్తుతం రానా పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటగా మార్చ్ నెలలో రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య రిలీజ్ అవుతోంది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో చేస్తున్న విరాటపర్వం మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ రీమేక్ మూవీ చేస్తున్నాడు రానా. మొత్తానికి ఈ కపుల్ మరోసారి బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు.