Begin typing your search above and press return to search.
లీడర్ 2 లైన్ లోకొస్తున్నాడు
By: Tupaki Desk | 30 July 2015 9:44 AM GMT500కోట్ల వసూళ్లు సాధించిన ప్రాజెక్టులో రానా కీలకపాత్రధారి. ఈ మాట వినడానికే ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది కదూ. అటు బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టించిన బాహుబలిలో భళ్లాలదేవుని పాత్రలో రానా అద్భుతంగా అభినయించాడన్న పేరొచ్చింది. ప్రస్తుతం అతడు ఓ తమిళ సినిమా షూటింగులో బిజీగా తిరుగుతూనే బాహుబలి 2 కోసం కసరత్తులు మొదలుపెట్టాడని తెలుస్తోంది.
అయితే ఈలోగానే మరో స్వీట్ న్యూస్ తో రానా తన అభిమానుల ముందుకొచ్చాడు. అసలు రానా కెరీర్ ప్రారంభించింది లీడర్ సినిమాతో. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా పెర్ఫామెన్స్ ని విమర్శకులు ప్రశంసించారు. మరి అంతటి క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ తెరకెక్కితే ఇంకెంత బావుంటుంది? ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
రానా నోటి నుంచే ఈ మాట వచ్చింది. సామాజిక వెబ్ సైట్ల ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని చేరవేశాడు రానా. లీడర్ కి సీక్వెల్ అంటే అందరిలోనూ ఆసక్తి పెంచేదే. ఎంతో ఎగ్జయిట్ చేసే పాయింట్ ఇది. శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి కథాంశాన్ని ఎంచుకుంటారో అన్న ఆసక్తి మళ్లీ మొదలైంది. అధికారిక వివరాల కోసం కాస్త వేచి చూడాల్సిందే.