Begin typing your search above and press return to search.
తేజ.. రానా.. చెరో ఐదు చిక్కింది
By: Tupaki Desk | 25 Aug 2017 4:35 PM GMTఒకరు కెరీర్ మొదట్లో హిట్ అందుకుంటే మరొకరు భారీ డిజాస్టర్ ని అందుకున్నవారు. ఆ తర్వాత సిన్ రివర్స్ అయ్యింది. ఒకరు కంటిన్యూగా హిట్స్ అందుకుంటుంటే మరొకరు కంటిన్యూగా ఘోర పరాజయాలను చవిచూశారు.అయితే కాలం వారిని ఒకటి చేసి మంచి విజయాన్ని అందించేలా చేసింది. దర్శకుడు తేజ.. హీరో రానా.. జయాపజయాల నుంచి పాఠాలను నేర్చుకొన్న వీరిద్దరూ కలిసి తీసిన చిత్రం మంచి విజయం సాధించడంతో దర్శకుడికి మరో జీవితాన్ని ఇవ్వగా.. హీరో కెరీర్ కి ఇంకాస్త బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి.
పోటీగా రెండు బడా సినిమాలున్నా నేనే రాజు నేనే మంత్రి సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. 12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తోనే ఆదరగొట్టి అన్ని భాషలు శాటిలైట్ రైట్స్ తో బడ్జెట్ డబ్బును ముందే సాధించుకొని హాయిగా రిలీజ్ అయ్యింది. సినిమాలో కొత్తదనం ఉండడంతో ప్రేక్షకులు ఆదరించారు. మొత్తంగా 25 కోట్ల లాభాన్ని అందించింది ఈ సినిమా. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం దర్శకుడికి మరియు హీరోకి చెరో 5 కోట్లు దక్కాయని టాక్. ముఖ్యాంగా తేజా ఇంతకుముందు తీసిన కొన్ని సినిమాలకి రెమ్యునరేషన్ అనేదే తీసుకోలేదని చెప్పాడు. కానీ ఎట్టకేలకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో భారీ మొత్తంలో అందుకున్నాడు.