Begin typing your search above and press return to search.
నా ఫ్రెండ్ చరణ్.. నా ప్రేక్షకుడు మా నాన్న
By: Tupaki Desk | 8 July 2017 4:58 AM GMTసౌత్ ఇండియా తారలు అంతా ఒక చోట చేరి మొన్న అబుదాబిలో సైమా అవార్డుల సందర్భంగా మాంచి హడావుడే చేశారు. అవార్డ్ షో అనగానే హీరోలు హీరోయిన్లు ఎలా వస్తారు అని అభిమానులు భావిస్తారో అలానే వచ్చారు ఇంకా చెప్పాలి అంటే అంతా కంటే గొప్పగానే వచ్చారు మన తెలుగు సితారాలు. ఈ అవార్డ్ ఫంక్షన్ కు వచ్చిన దగ్గుబాటి రానా కూడా మాంచి సందడే చేశాడు. అయితే ఒక యాంకర్ అక్కడ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగితే.. మనోడు చటుక్కున భలే సమాధానాలు చెప్పాడు.
మీరు ఎవరన్నా ఒక సెలబ్రిటీతోనే మీ లైఫ్ అంతా గడపాల్సి వస్తే ఏం చేస్తారు అంటే.. అసలు నేను రోజూ గడిపేదే సెలబ్రిటీలతో కాబట్టి.. ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు అన్నాడు. అయితే ఎవరన్నా ఒక స్నేహితుడితో ఉండిపోవాల్సి వస్తే మాత్రం.. రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు కాబట్టి.. తనతో ఉండిపోతా అంటున్నాడు. అలాగే లైఫ్ లాంగ్ తన తండ్రే తనకు పెద్ద ప్రేక్షకుడు అని.. ఆయనిచ్చే ఫీడ్ బ్యాక్ తోనే చాలా డిసెషన్లు తీసుకుంటాను అని కూడా చెప్పాడు.
మీరు ఒకే పాటను జీవితాంతం వినవలిసి వస్తే? బాహుబలి మాహిష్మతి టైటిల్ సాంగ్
మీరు ఒక్క సిటీలోనే ఇక ఉండిపోవలిసి వస్తే? హైదరాబాద్
రోజు ఒకే ఫుడ్ తినవలిసి వస్తే : హలీమ్
ఒకే సినిమా రోజూ చూడవలిసి వస్తే : స్టార్ వార్స్ (ఇంగ్లిష్ ) ఆల్రెడీ 200 సార్లు చూశాడట..
ఒకే టివి షో చూడవలిసి వస్తే : టివి ఆఫ్ చేస్తాను
ఒక మనిషే ఫ్రెండ్ గా ఉండే పరిస్థితి వస్తే : రామ్ చరణ్
మీకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది ఎవరు కావాలి : మా నాన్న సురేశ్ బాబు
ఒకే స్టార్ తో గడపవలిసివస్తే : నేను చిన్నప్పుడు నుండి వాళ్లతోనే ఉంటున్న.. కష్టం చెప్పడం.
చివరిగా ఒక లవ్ ఎమోజీ ఇప్పుడు మీకు ఇస్తే ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఎవరికి ఇస్తారు అని అడిగితే.. టక్కున నటి ఖుష్బూ కు ఇస్తాను అన్నాడు. ''ఎందుకంటే నేను పుట్టినప్పుడు నుండి ఆవిడకు నేను తెలుసు. నాకు ఆవిడ తల్లి లాంటిది'' అని చెప్పాడు. మొత్తానికి భలే ఇంట్రెస్టింగ్ సమాధానాలు కదూ.