Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: బాబుగా మారిన భల్లాలదేవుడు

By:  Tupaki Desk   |   12 Sep 2018 9:40 AM GMT
ఫస్ట్ లుక్: బాబుగా మారిన భల్లాలదేవుడు
X
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్' ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్నగారి అవతారంలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది. తాజా గా 'ఎన్టీఆర్' టీమ్ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషిస్తున్న రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను వినాయక చవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు.

స్లిమ్ లుక్ లో ఉన్న రానా దగ్గుబాటి గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో ఉన్నాడు. మీసాలు.. 80' ల హెయిర్ స్టైల్ తో చంద్రబాబు గెటప్ లో కనిపించాడు. తీక్షణమైన చూపులతో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ రానా ఇలా ట్వీట్ పెట్టాడు "శ్రీ N. చంద్రబాబు నాయుడు 1984."

ఇక చంద్రబాబు పాత్రను పోషించేందుకు రానా దగ్గుబాటి హోమ్ వర్క్ చేస్తునట్టుగా గతంలో చెప్పుకొచ్చాడు. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ తో పాటుగా మాట తీరునుకూడా అనుకరించేందుకు ఓల్డ్ వీడియోస్ చూడడం లాంటివి చేస్తున్నాడట. మరి ఆ ట్రైనింగ్ పూర్తిగా పనిచేస్తున్నట్టే ఉంది.