Begin typing your search above and press return to search.
డీఎస్పీ పాట కోసం హెడ్ ఫోన్స్ కొన్నాడు
By: Tupaki Desk | 17 Jan 2016 11:36 AM GMTనాన్నకు ప్రేమతో సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా ఓ పాట రాశాడు. సినిమాలో లేకపోయినా, తన తండ్రికి నివాళిగా ఓ పాటను తనే రాసి కంపోజ్ చేశాడు డీఎస్పీ. మూవీ ఆఖర్లో టైటిల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట వస్తుంది.
నాన్నకు ప్రేమతో అంకితం.. నా ప్రతీ క్షణం అంటూ సాగే ఈ పాటను దేవి స్వయంగా పాడాదు. మూవీ ఆడియోతో పాటు ఈ సాంగ్ ను రిలీజ్ చేయలేదు. తర్వాత మూవీ రీ రికార్డింగ్ సమయంలో ఈ పాటను కూడా రికార్డ్ చేశాడు డీఎస్పీ. ఆ విషయాన్ని వెల్లడించి, తర్వాత రిలీజ్ చేస్తానని చెప్పాడు. అన్నట్లుగానే తన తండ్రి ఫోటోలతో ఓ చక్కని వీడియోగా రూపొందిన ఈ పాట.. దేవి చాలా అంకిత భావంతో పాడాడు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకోవడమే కాదు.. ప్రతీ ఒక్కరినీ తట్టి లేపేలా ఉంటుంది.
ఈ పాటను వినేందుకు కొత్తగా ఓ హెడ్ ఫోన్ కొన్నానంటూ.. భళ్లాలదేవుడు రాణా ట్వీట్ చేశాడు. లూప్ లో పెట్టుకుని మరీ ఈ సాంగ్ వింటానని, అంతగా తన హృదయాన్ని ఈ పాట ఆకట్టుకుందంటున్నారు దగ్గుబాటి రాణా. దేవిశ్రీ రాసి, కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ పాట.. తండ్రిని ప్రేమించే ప్రతీ చిన్నారినీ తట్టి లేపుతుందని ఒప్పుకోవాలి.