Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్

By:  Tupaki Desk   |   31 Dec 2017 10:24 AM GMT
టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్
X
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేది పాత సామెత. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలి అనేది నేటి ట్రెండ్. దీన్ని మన హీరోలు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. దగ్గుబాటి రానా ఇటీవలే ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పేరు గాంచిన శాంతా క్రజ్ లో ఇల్లు కొనుకున్నాడు. గృహ ప్రవేశం చేసాడు కాని హైదరాబాద్ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యే ఉద్దేశంలో మాత్రం రానా లేడు. ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో కూడా విస్తృతంగా నటించడం, హింది వెబ్ సిరీస్ ఒప్పుకోవడం లాంటి కారణాల వల్ల రానా తరచు ముంబైకి వెళ్లి రావలసి వస్తోంది. దీంతో బయట ఎక్కడో ఉండి ఇబ్బంది పడటం ఎందుకు అక్కడే ఒక ఇల్లు ఉంటే పోలా అని అనిపించడం ఆలస్యం రానా అక్కడ ఇల్లు కొనేసాడు.

తనకు బలమైన అనుబంధం ఉన్న హైదరాబాద్ ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు అంటున్న రానా ముంబైలో ఇల్లు తనకు ఒక మంచి జ్ఞాపకంగా మలుచుకునేందుకు తీసుకున్నట్టు చెప్పాడు.రానా కంటే ముందు ఇతని డియరెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తేజ్ కూడా అక్కడ గతంలోనే ఇల్లు కొని ఉంచాడు. చరణ్ సలహాతోనే రానా ఇప్పుడు కొన్న ఇల్లు సెలెక్ట్ చేసుకున్నట్టు టాక్. రామ్ చరణ్ భార్య ఉపాసన - మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కలిసి దేశంలో ముఖ్య నగరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. మరి అందులో భాగంగానే చరణ్, రానా ఇలా ఒక్కొక్కరు ముంబైలో ఆస్తులు కొంటున్నారేమో అనిపిస్తుంది. బాగుంది కదా. తెలుగు సినిమాలు చేస్తూ బాలీవుడ్ కు నెలవైన ముంబైలో ఆస్తులు కొనే కొత్త ట్రెండ్ ఇంకెంత హీరోలు ఫాలో అవుతారో చూడాలి.